‘సమాచార హక్కు’ను వినియోగించుకోవాలి

‘సమాచార హక్కు’ను వినియోగించుకోవాలి


- కేంద్ర సమాచార హక్కుచట్టం కమిషనర్, ప్రొఫెసర్

- శ్రీధరాచార్యులు

కేయూక్యాంపస్ :
సమాచారహక్కు చట్టాన్ని వినియోగించుకుని నిజాలను వెలికితీయూలని కేంద్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ ప్రొఫెసర్ శీధరాచార్యులు సూ చించారు. కేయూలోని మైక్రో బయూలజీ విభాగం ఆధ్వర్యం లో ఎథిక్స్ ఇన్ మైక్రోబయాలజీ అనే అంశంపై పరిపాలనా భవనంలోని సేనేట్‌హాల్ శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని వేరే వారు పబ్లిష్ చేశారని, దాన్ని కాఫీ రైట్ కింద కేసు వేసి గెలిచానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. యూనివర్సిటీల్లో పరిశోధన అనేది నేడు నిజారుుతీగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధనలను నేరుగా చేయూలని సూచిం చారు.



కేయూసీడీసీ డీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య పరిశోధనలుచేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు ఆయనను అభినందించారు. ఆయన గౌరవార్థం జాతీయ సదస్సు ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ మాజీ వీసీ విద్యావతి మాట్లాడుతూ విలువలు పాటించినప్పుడే సమాజం బాగుంటుందని సూచించారు. ఈ సదస్సులో కేయూ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్ గిరీశం, విభాగం అధిపతి ఎం. శ్రీనివాస్, బోర్డు ఆప్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ పి. వెంకటయ్య, డాక్టర్ ఈ సుజాత మాట్లాడారు. ఐఐసీటీ ప్రొఫెసర్ ఆర్‌ఎస్ ప్రకాశం మైక్రోబ్స్‌పై ప్రసంగించారు. ఈ సదస్సుకు కేయూసీడీసీ డీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య అధ్యక్షతవహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధరాచార్యులను మాజీవీసీ విద్యావతి, సీడీసీడీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య శాలువా కప్పి, మెమొంటో అందజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top