నీచ రాజకీయూలతోనే పార్టీని వీడుతున్నా..

నీచ రాజకీయూలతోనే పార్టీని వీడుతున్నా.. - Sakshi


ఎస్సీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా ఓసీ, బీసీలా?

అధినేతకు చెప్పినా పట్టించుకోవడం లేదు

అందుకే టీడీపీకి గుడ్‌బై

దొమ్మాటి సాంబయ్య వెల్లడి


 

వరంగల్ : తెలుగుదేశం పార్టీలోని అగ్రవర్ణాల, అగ్రనేత నీచ రాజకీయూలు తట్టుకోలేక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ రాష్ట్ర పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దొమ్మాటి సాంబయ్య తెలిపారు. హన్మకొండలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ఆవిర్భవించిన 1982 సంవత్సరంలో పార్టీలో చేరిన తాను 1987లో పరకాల మండలం మలక్‌పేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యూనని, పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. తర్వాత పోలీస్‌శాఖలో ఎస్సైగా ఉద్యోగం రావడంతో పార్టీ వీడానని తెలిపారు. 1999లో పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టీడీపీ జాబితాలో తన పేరు ఉన్నా బొజ్జపల్లి రాజయ్యకు టికెట్ ఖరారు చేయడంలో జిల్లా అగ్రనేతల హస్తం ఉందన్నారు.



ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 2004 ఎన్నికల ముందు పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ఇద్దరు జెడ్పీటీసీ, ముగ్గురు ఎంపీపీలను గెలిపించినట్లు తెలిపారు. 2009లో వరంగల్ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయూలని బీఫాం ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌కు కేటారుుంచగా తాను పోటీలో ఉన్నానని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రిజర్వేషన్లు మారగా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేయడంతో పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. 2012లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయూత్ర సందర్భంగా మళ్లీ పార్టీలో చేరినట్లు వివరించారు.



2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి, పొత్తుల పేరుతో బీజేపీకి ఈ సీటు కేటారుుంచారని, ఆ తర్వాత 430 కేసుల్లో ఉన్న ఓ ఓసీకి ఎస్సీ నియోజకవర్గాన్ని అప్పగించారని అన్నారు. దీనిపై పలుమార్లు పార్టీ అధినేత, నాయకులకు విన్నవించినా పట్టించుకోకపోవడమే కాకుండా జనరల్ నియోజకవర్గమైన పరకాలకు తాత్కాలిక ఇన్‌చార్జిగా తనకు బాధ్యతలు అప్పగించడంతో కనీస గౌరవం దక్కక పార్టీ వీడుతున్నట్లు అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు ఆయన తెలిపారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top