పీవీ వెటర్నరీ వర్సిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు


సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ, యానిమల్, ఫిషరీస్ శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి ఈ నోటిఫికేషన్ అమలులోకి రానుంది. రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రస్తుత క్యాంపస్‌లోనే ఇది ఉంటుందని వెల్లడించింది. యూనివర్సిటీకి చాన్స్‌లర్‌గా గవర్నర్ వ్యవహరిస్తారు. గవర్నర్ వైస్-చాన్స్‌లర్‌ను నియమిస్తారు. పాలకమండలి ఉంటుంది.



మండలిలో సభ్యులుగా వైస్-చాన్స్‌లర్‌తోపాటు, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి, డెరైక్టర్, ఆర్థికశాఖ కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్‌లు ఉంటారు. మరో ఏడుగురు ఇతర సభ్యులుగా ఉంటారు.వైస్- చాన్స్‌లర్ చైర్మన్‌గా అకడమిక్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది.



మరో 12 మంది సభ్యులుగా ఉంటారు. అకడమిక్ కౌన్సిల్‌లోకి ఐదుగురికి మించకుండా ఇతర సభ్యులను కోఆప్ట్ చేసుకునే వీలుంది.  దీనికి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ యాక్ట్-2005ను అన్వయింపజేస్తామని ప్రభుత్వం జారీచేసిన మరో ఉత్తర్వు పేర్కొంది.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top