ఈత..కడుపుకోత


ఒక్కపూట బడి కావడంతో పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఐదుగురు స్నేహితులు కలిసి గ్రామసమీపంలోని నీటిట్యాంక్‌లో ఈతకు వెళ్లారు. తాడుసాయంతో ట్యాంకులోకి దిగి ఈతకొట్టారు. ముగ్గురు స్నేహితులు పైకి ఎక్కారు. సందీప్, సాయిక్రిష్ణలు పైకి ఎక్కే సమయంలో తాడు తెగింది. ట్యాంకులో మునిగి ప్రాణాలు విడిచారు. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.

 

గాంధీనగర్(సూర్యాపేటరూరల్) ఈత సరదా ఇద్దరి విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ ఘటన సూర్యాపేట మం డలం గాంధీనగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ గ్రామానికి చెందిన దోమలపల్లి వెంకటమ్మకు కూతురు, కుమారుడు ఉన్నారు. చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో పిల్లలను కష్టపడి సాకుతోంది. అదే విధంగా దోమలపల్లి లిం గమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరినీ లయోలా పాఠశాలలోనే చది విస్తోంది.



వెంకటమ్మ కుమారుడు సాయిక్రిష్ణ(14) లయోలా పాఠశాల లో 9వ తరగతి చదువుతుండగా, లిం గమ్మ చిన్న కుమారుడు సందీప్(12) ఇదే పాఠశాలలో 7వ తరగతి అభ్యసిస్తున్నాడు. ఒక్కపూట బడులు కావడంతో బుధవారం పాఠశాల నుంచి రాగానే సాయిక్రిష్ణ,సందీప్‌లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని మామిడితోటలో గల నీటిట్యాంక్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. కాగా నీటిట్యాంక్‌లోకి దిగిన ఐదుగురు చిన్నారులలో ముగ్గురు చిన్నారులు ఈత కొట్టిన అనంతరం తాడు సహాయంతో బయటకు వచ్చారు.



ఈ క్రమంలో తాడు తెగిపోవడంతో సాయిక్రిష్ణ, సందీప్‌లు ట్యాంక్‌లోనే ఉండిపోయారు. ట్యాంక్‌లో నీళ్లు ఎ క్కువగా ఉండడంతో ఎక్కువ సమ యం ఈత కొట్టలేక నీటిలో కాలు ఆన క సాయిక్రిష్ణ,సందీప్‌లు మృతి చెందారు. బయటకు వచ్చిన ముగ్గురు చిన్నారులు గ్రామంలోకి వెళ్లి సాయిక్రిష్ణ, సందీప్‌లు ఇద్దరూ నీటిట్యాంక్ లో ఉన్నారని చెప్పారు. దీంతో మృతు ల బంధువులు, స్థానికులు ట్యాంక్ వద్దకు వెళ్ళి చూడగా ట్యాంక్‌లో అప్పటికే సాయిక్రిష్ణ, సందీప్‌లు మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.



చిన్నారుల మృతదేహాలను చూసి వారిద్దరి తల్లుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతిచెందిన చిన్నారులతో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



గాంధీనగర్‌లో విషాదఛాయలు



ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృ త్యువాతపడడంతో గాంధీనగర్‌లో వి షాదఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా చదువుకునే చిన్నారు లు ఇలా మృత్యువాతపడటం ఏంటని ప్రతి ఒక్కరూ ఆవేదనవ్యక్తం చేశారు. మృతిచెందిన చిన్నారులను చూసే ందుకు పెద్ద ఎత్తున ప్రజలు తర లివచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top