పిడుగుపాటుకు మందుగుండు పేలి ఇద్దరు దుర్మరణం

పిడుగుపాటుకు మందుగుండు పేలి ఇద్దరు దుర్మరణం - Sakshi

  • పిడుగుపాటుకు క్వారీలో మందుగుండు పేలి ఇద్దరి దుర్మరణం

  •  నలుగురికి తీవ్రగాయాలు

  •  కొత్తగట్టు శివారు క్వారీలో ఘటన

  • ఆత్మకూరు : క్వారీలో పనికి వెళ్లిన కూలీల ప్రాణాలు గాలిలో కలిశాయి. క్వారీలో పేల్చేందుకు మందుగుండును సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడి భారీ పేలుడు జరగడంతో ఇద్దరు కార్మికులు అక్కడిక క్కడే మృతిచెంది మాంసపు ముద్దలుగా మారారు. బండరాళ్లు తగిలి మరో నలుగురు తీవ్రం గాయపడ్డారు.



    ఈ సంఘటన మండలంలోని కొత్తగట్టు సమీపంలోని మహేందర్‌రెడ్డి క్వారీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..  మండలంలోని అక్కంపేటకు చెందిన ఏడుగురు కార్మికులు, శాయంపేట మండలం మాందారిపేటకు చెందిన ఒక కార్మికుడు ఈ క్వారీలో పనిచేస్తున్నారు. కార్మికులంతా క్వారీలో ఇటీవల బ్లాస్టింగ్‌లు జరిపి రాళ్లను వేరు చేశారు. మళ్లీ రెండు రోజులుగా బ్లాస్టింగ్ బోర్లలో మందుగుండు సామగ్రి నింపుతున్నారు. మందుగుండు నింపడం పూర్తయ్యాక కొంతదూరం వెళ్లి పేల్చాల్సి ఉంది.



    ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం వర్షం మొదలైంది. దీంతో కార్మికులు పేలుళ్లకు సిద్ధమవుతండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో మందుగుండు  భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో బండరాళ్లు ఎగిరిపడి అక్కంపేటకు చెందిన కార్మికుడు ఓర్సు కిష్టయ్య(35), శాయంపేట మండలం మాందారిపేటకు చెందిన జడిశెట్టి మధుకర్(20) అక్కడికక్కడే మృతి చెందారు. వారి మీద రాళ్లు పడటంతో నుజ్జునుజ్జయ్యారు.



    అక్కంపేటకు చెందిన ఓర్సు సాలయ్య, దారగండ్ల మధుకర్, పల్లపు సమ్మయ్య, సారంగుల సమ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.కార్మికులు మల్లేశ్, ఐలయ్య క్షేమంగా బయటపడ్డారు. కుమారు డు కిష్టయ్య చనిపోవడం.. తండ్రి సాలయ్య తీవ్రం గా గాయపడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడు కిష్టయ్యకు భార్య దుర్గ, ఒక కుమారుడు ఉండగా, మధుకర్‌కు భార్య ఐల మ్మ, దత్తత తీసుకున్న ఒక కుమార్తె ఉన్నారు.

     

    అనుమతులు లేకుండానే పేలుళ్లు ?



    మహేందర్‌రెడ్డి క్వారీలో పేలుళ్లకు అనుమతులు లేవ ని తెలిసింది. ఈ క్వారీలో యథేచ్ఛగా పేలుళ్లు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల 43 బోర్ బ్లాస్టింగ్‌లు ఏర్పాటు చేశారని వారు తెలిపారు. కాగా ఈ క్వారీ అనుమతుల విషయమై తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా అనుమతులు ఉంది.. లేనిది. శనివారం చూసి చెబుతానన్నారు.  

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top