ఎంపీ కవిత ఆశీస్సులు ఉన్నవారికే!

ఎంపీ కవిత ఆశీస్సులు ఉన్నవారికే! - Sakshi


కేబినెట్‌లో బెర్త్ ఎవరికో?



సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో కొలువు తీరే రెండో మంత్రి ఎవరనే చర్చకు మళ్లీ తెర లేచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికలలో విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్ జూన్ రెండున సర్కారును ఏర్పాటు చేసింది. అ ప్పుడు జిల్లా నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు లభించింది. నాలుగున్నర నెలల తరువాత, ఈ నెల 22న మంత్రివర్గ వి స్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ ముఖ్యులు, ఆశావహులకు అధిష్టానం నుంచి సమాచారం అందింది.



ఈ నేపథ్యంలో జిల్లాలో రెండో మంత్రిగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. మొదటి నుంచి ప్రధానంగా నలుగురు శాసనసభ్యులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రెండో విడత అదృష్టం వరించే ఆ ఎమ్మెల్యే ఎవరు? లేక ‘విప్’తో సరిపెడతారా? అన్నది తెలియ డం లేదు. ఆశావహులు మాత్రం ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.



సామాజిక కోణం, సీనియారిటీయే ప్రామాణికం!

రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో విజ యం అందించిన జిల్లాకు రెండో మంత్రి పదవి ఖా యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ దిగ్గజాలను మట్టి కరిపించిన నేపథ్యంలో రెండో మం త్రి ని ఇవ్వడం న్యాయమని కూడ వారు బలంగా వా ది స్తున్నారు. అయితే, రెండో దఫా విస్తరణలో నాయకు  ల ప్రాధాన్యం, సామాజిక కోణం, సీనియారిటీ తది  తర అంశాలను పరిశీలించాకే మంత్రివర్గంలో చోటి  చ్చే అవకాశం ఉందంటున్నారు.



ఇప్పటికే సీఎం సహా 11 మంది మంత్రివర్గంలో ఉండగా, ఇంకా ఎంతమందిని తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మా రింది. మొదటి విడతలో సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. రెండో విడతకు కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ దిగ్గజం డి.శ్రీనివాస్‌పై గెలుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్ పేరు కూడ ప్రచారంలో ఉంది. గతంలో బాజిరెడ్డి వేర్వేరు ఎన్నికలలో రెండు చోట్ల నుంచి గెలుపొంది, మూడోసారి నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించి రికార్డు నెలకొల్పారు.



సామాజికాంశాలు, అధినేతతో ఉన్న చొరవలను పరిగణనలోకి తీసుకుంటే నిజామాబాద్ అర్బన్, బోధన్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్తా, అహ్మద్ షకీల్ కూడా మంత్రిపదవి రేసులో ఉంటారని అంటున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ ఇచ్చి న హామీ మేరకు వీరందరూ ప్రయత్నం చేసినా, మొ దటి విడతలో చాన్స్ దక్కలేదు.

 

ఎంపీ కవిత ఆశీస్సులు ఉన్నవారికే!

కేసీఆర్ కొలువులో రెండో విడత విస్తరణలో అమాత్యులు ఎవరు? తెలంగా ణ రాష్ట్రం తొలి కేబినేట్‌లో రెండో మంత్రిగా జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? ఈ సారి విస్తరణలో ఇందూరు నుంచి కేసీఆర్ ఎవరికి ప్రాతినిధ్యం కల్పించనున్నారు? ఆయన అంతరంగంలో అసలేముంది? నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి? ఈసారి విస్తరణలో మనకు మంత్రా? విప్పా? ఇవన్నీ రాజకీయ విశ్లేషకులలో సాగుతున్న చర్చలు. వాస్తవానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి కేటాయించిన తర్వాత మరో మంత్రికి అవకాశం లేకపోవచ్చన్న చర్చ కూడ ఉంది.

 

ఎందుకంటే మంత్రివర్గంలో సీఎం సహా 18 మందికే పరిమితం చేయాలనుకున్నా, అందులోను ఒకటి తగ్గుతుందంటున్నారు. మొదటి నుంచి ఉద్యమాలకు ఊతమిచ్చిన కరీంనగర్, వరంగల్ జిల్లాలలో ఇప్పటికే ఇద్దరిద్దరున్నా ఇంకా ఒక్కొక్కరికి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఇద్దరికీ, నల్గొండ, ఖమ్మంలో సైతం ఒక్కరు, లేదా ఇద్దరికి ప్రాతినిధ్యం కల్పిస్తారని చెబుతున్నారు. గిరిజన, ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లోను ఇంకొకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటున్నా. ఆరు మంత్రి, మూడు విప్ పదవులలో జిల్లాలో ఎవరైనా ఒకరికీ చాన్స్ దక్కవచ్చని, లేదంటే కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top