దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేయూలి


 ‘ఎర్రబెల్లి’ బఫూన్‌లా వ్యవహరిస్తున్నారు

 టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు


 

కల్మశం లేని ఈ నవ్వులు వసివాడారుు. కపటుల దాడితో గాయపడ్డారుు. ర్యాగింగ్ భూతం వికృత చేష్టలకు విసిగివేశారారుు. తుదకు ఉసురుతీసుకున్నారుు. హన్మకొండకు చెందిన దుర్గాబారుు, మురళీకృష్ణ దంపతుల గారాల పట్టి రిషితేశ్వరి.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ రూపంలో శ్రుతిమించిన సీనియర్ల రాక్షసత్వాన్ని తాను కనుమూయడం ద్వారా ప్రపంచం కళ్లకు కట్టింది. ఇది మనం మేల్కొనే సమయం. ర్యాగింగ్‌ను అంతం చేయూల్సిన తరుణం

 

 

హన్మకొండ: టీడీపీకి దమ్ముంటే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీచేయూలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు సవాల్‌విసిరారు.  టీడీపీ ఎల్‌పీ నేత ఎర్రబెల్లి బఫూన్‌ల వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రవీందర్‌రావు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంత వెలిగిపోతుందో ఆపార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంతో తెలిసిపోరుుందన్నారు. దయాకర్‌రావు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అక్రమాలు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బయటపెట్టారని తెలిపారు. కడియం రాజీనామా చేస్తే టీఆర్‌ఎస్‌లో చేరొచ్చని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆత్రుతతో ఉన్నారని, ఆయన టీఆర్‌ఎస్‌లోకి రావడం ఎన్నటికీ కుదరదన్నారు.



పేదలకు మంజూరైన ఇళ్ల బిల్లులు కాజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లులు ఇవ్వాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎక్కడ పుట్టగతులు లేకుండా పోతాయోమోనని టీడీపీ విమర్శలు చేస్తుందని అన్నారు.  సమావేశంలో నాయకులు గుడిమల్ల రవికుమార్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, మరుపల్లి రవి, చింతల యాదగిరి. నయిముద్దీన్, ఎల్లావుల లలితా యాదవ్, ఎడవెల్లి కృష్ణారెడ్డి, జన్ను జకార్యా, కె.వాసుదేవరెడ్డి, పోగుల రమేష్ పాల్గొన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top