పరామర్శించే తీరికే లేదా!


బాధిత రైతు కుటుంబాలను పట్టించుకోలేదు

టీఆర్‌ఎస్ సర్కారుపై వైఎస్‌ఆర్ సీపీ ధ్వజం

వారి కళ్లు తెరిపించడానికే కామారెడ్డిలో 10న రైతు దీక్ష

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో

వైఎస్ ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్


 కామారెడ్డి: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేకపోయూరని వైఎస్ ఆర్‌సీపీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. అందుకే సర్కారు కళ్లు తెరిపించాడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ నెల పదిన కామారెడ్డిలో దీక్ష చేపడుతున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన కా మారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు దీక్ష వివరాలను వెల్లడించారు.



ఉదయం 11 గంటలకు కామారెడ్డి పట్టణంలోని సీ ఎస్‌ఐ చర్చిగ్రౌండ్‌లో రైతు దీక్ష ఉంటుందన్నారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కు టుంబాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇపుడు సీఎం కేసీఆర్, ఆయన కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న జి ల్లాలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకే కామారెడ్డి కేంద్రం   గా రైతుదీక్ష చేపట్టి వారికి భరోసా కల్పించనున్నామని తెలిపారు. రైతులు చనిపోతున్నా సర్కారు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రోజుకో ప్రకటన చేయడమే తప్ప ఆచరణలో ఏమీ మేలు చూప డం లేదన్నారు.

 

ఆర్‌టీసీ కార్మికుల సమ్మె న్యాయమైనదే

తమ హక్కుల సాధన కోసం ఆర్‌టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయమైనది, ధర్మమైనదని నల్లా సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. కార్మికుల సమ్మెకు వైఎస్ ఆర్‌సీపీ స ంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తె లిపారు. ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశా  రు. అలాగే దివంగత సీఎం వైఎస్ ప్రవేశపెట్టిన 108, 104 ల ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయని, కానీ, నేటి ప్రభుత్వం అందులో పనిచేసే ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడంతో వారు రోడ్డు ఎక్కుతున్నారని తెలి పారు. ప్రభుత్వం ఇప్పటికైనా 108, 104 ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

5 వేల మందితో రైతు దీక్ష

 - వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి


కరువు, అకాల వర్షాలు, వడగండ్లతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అద్యక్షుడు పి.సిద్దార్థరెడ్డి డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే, నేటి పాలకలు దండుగ చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ పూర్తి చేయకపోవడంతోపాటు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇ బ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు భరోసా కల్పించి, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ రైతు దీక్ష చేపడుతోందన్నారు. కామారెడ్డిలో జరుపతలపెట్టిన రైతు దీక్షకు ఐదు వేల మంది రైతులు వస్తారని తెలిపారు.  బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుంజా వెంకట్రావ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు.



రైతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కూచి సంగయ్య మాట్లాడుతూ అసలే కరువు కా టకాలతో ఇబ్బం దులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ కామారెడ్డి ఇన్‌చార్జీ, సే వాదళ్ ప్రధాన కార్యదర్శి నీలం రమేశ్, బీసీసెల్ రాష్ట ప్రధాన కార్యదర్శి గుంజె వెంకట్రావ్, జిల్లా మహిళ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు విజయలక్ష్మి, పోచవ్వ,  రైతు విభా  గం జిల్లా అధ్యక్షుడు కె.సంగయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నవీన్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, భిక్కనూరు, లింగంపేట మండలాల అధ్యక్షుడు భూమలింగం, డాక్టర్ విఠల్, నాయకులు బల్గం రవి, ప్రమోద్, నవీన్, రాజు, పీర్‌సిం గ్, గాండ్ల రవి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top