టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ వీధి పోరాటం

టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ వీధి పోరాటం - Sakshi


- నల్లగొండ బత్తాయి మార్కెట్‌ శంకుస్థాపనలో ఆధిపత్య పోరు

- పోటాపోటీగా రాళ్లు రువ్వుకున్న కార్యకర్తలు




సాక్షి, నల్లగొండ: నల్లగొండ రణరంగంగా మారింది. జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన సందర్భంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య చెలరేగిన గొడవ రాళ్ల వర్షానికి దారి తీసింది. శంకుస్థాపనకు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి రావడానికి ముందు బత్తాయి మార్కెట్‌ ప్రాంగణం అట్టుడికింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో హోరెత్తిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ రాళ్ల యుద్ధంతో ఏం జరు గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్ల దాడుల్లో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో కార్లు, బైక్‌లు ధ్వంసమ య్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. తర్వాత మంత్రులు హరీశ్, జగదీశ్‌రెడ్డి కార్యక్రమ ప్రదేశానికి చేరుకుని బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొన్నారు.



మధ్యాహ్నం నుంచే ఉద్రిక్తత..

బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన సందర్భం గా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకో వడంతో మధ్యాహ్నం నుంచే నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత మర్రిగూడ బైపాస్‌ నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో మంత్రి హరీశ్‌కు స్వాగతం పలుకుతూ వందలాది మంది కార్యకర్తలు ర్యాలీగా క్లాక్‌టవర్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ మరికొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు తోడయ్యారు. అనంతరం ర్యాలీ గా బత్తాయి మార్కెట్‌కు శంకుస్థాపన జరిగే గంధంవారిగూడెం సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకున్నారు.



కోమటిరెడ్డి రాకతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోమటిరెడ్డి గో బ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కాంగ్రెస్‌ జిందాబాద్‌ అంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దాదాపు గంటపాటు కోమటిరెడ్డి అక్కడే తన అనుచరులతో ఉన్నారు. అదే సమయంలో నల్లగొండ టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి కూడా పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీతో అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా కోమటిరెడ్డిని ప్రాంగణం నుంచి బయటకు పంపారు. దీంతో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడున్న ఫ్లెక్సీలను చించేందుకు యత్నించడంతో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో అలజడి ప్రారం భమైంది. కోమటిరెడ్డి వెళ్లిపోగానే కార్యక్రమ ప్రాంగణంలోకి రాళ్లు పడ్డాయి. దుబ్బాక నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా ఆవేశానికి లోనై రాళ్లు విసిరారు. ఇరువైపుల నుంచి రాళ్ల వర్షం కురియడంతో సభా ప్రాంగణంలో ఉన్న సామాన్యులు హడలిపో యారు. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. అరగంట తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.



వైఎస్‌ విగ్రహం వద్ద కోమటిరెడ్డి ధర్నా

తనను కార్యక్రమ ప్రాంగణం నుంచి పంపిం చివేయడంతోపాటు పార్టీ కార్యకర్తలపై దాడు లకు నిరసనగా కోమటిరెడ్డి దేవరకొండ రోడ్డు లోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. రైతులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులు చేశారని, ఈ ఉసురు కేసీఆర్‌కు తగిలి తీరుతుందన్నారు. జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అక్కడకు చేరుకొని కోమటిరెడ్డికి సర్దిచెప్పేం దుకు యత్నించారు. అయినా ధర్నా విరమించకపోవడంతో ఆయన్ను అరెస్టు చేసి మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం మంత్రులు హరీశ్, జగదీశ్‌రెడ్డి బత్తాయి మార్కెట్‌కు చేరుకొని శంకుస్థాపన చేసి, అక్కడే నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.



ప్రతిపక్షాలను ప్రజలు రద్దు చేశారు: జగదీశ్‌రెడ్డి

తెలంగాణ ఉన్న ఏకైక రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్సేనని, రాష్ట్రంలో ప్రతిపక్షాలను ప్రజలు రద్దు చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కొందరు ముఠా నాయకులు, తెలంగాణ ద్రోహులు, అభివృద్ధిని అడ్డుకునే దుర్మార్గులు మాత్రమే తెలంగాణలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను సరైన మార్గంలో నడిపించే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉందని, అందుకే తాను ఆయనకు మద్దతు ఇస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భాస్కరరావు, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, జెడ్పీ చైర్మన్‌ బాలూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.



ఏడాదిలో సీఎం కుర్చీ కూలుతుంది: కోమటిరెడ్డి

సీఎం కేసీఆర్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే లా వ్యవహరిస్తున్నారని, చేపలు, గొర్రెలు, మూడెకరాలంటూ విభజించి పాలిస్తున్నా రని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బైక్‌ ర్యాలీ సందర్భంగా క్లాక్‌టవర్‌ సెంటర్‌లో ఆయన మాట్లాడా రు. ఇంకో ఏడాదిలో సీఎం కేసీఆర్‌ కుర్చీ కూలిపో తుందని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధి కారంలోకి వస్తేనే రైతు రాజ్యం వస్తుం దన్నారు. నల్లగొండలో పోటీచేస్తానని కేసీఆర్‌ అంటున్నారని, మోదీ, కేసీఆర్‌ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీచేసినా కాంగ్రెసే గెలుస్తుందన్నారు. వారం పదిరోజుల్లో నల్లగొండ జిల్లాలోని సగంమంది టీఆర్‌ఎస్‌ నేతలు జైలుకెళ్తారన్నారు.  



కాంగ్రెసోళ్లు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు: హరీశ్‌

బహిరంగసభలో మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడుతూ.. తమకు పార్టీలు, రాజకీ యాలు ముఖ్యం కాదని, మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలే ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పింఛన్‌ రూ.200 ఇస్తే తాము రూ.1000 ఇస్తున్నామని, వాళ్లు వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఇస్తే తాము తొమ్మిది గంటలు ఇస్తున్నామ న్నారు. సంక్షేమ హాస్టళ్ల పిల్లలకు దొడ్డు బియ్యం, పురుగుల బియ్యంతో కాంగ్రె సోళ్లు అన్నం పెడితే.. తాము సన్న బియ్యం, పాత బియ్యంతో పెడుతు న్నామన్నారు. కాంగ్రెస్‌ నేతలు కోర్టులకెళ్లి భూసేకరణ జీవోలు కొట్టివేయిస్తున్నారని, ప్రాజెక్టుల్లో నీళ్లు రాకుండా అడ్డుకుం టున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుగ్ధతోనే కోమటిరెడ్డి లాంటి కాంగ్రెస్‌ నేతలు చెడగొట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నా రని విమర్శించారు. త్వరలోనే తెలం గాణలో పండ్లు, కూరగాయల కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని, ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు అమ్ముకునేలా పండ్లు, కూరగాయల రైతులకు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.



సీఎం తగిన మూల్యం చెల్లించుకుంటారు: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేయటం అమానుషమని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాకు వచ్చి న మంత్రి హరీశ్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్లిన కోమటిరెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలు, రైతులపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్లతో దాడి చేయటం దారుణమన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు.. ధర్నాచౌక్‌ వద్ద విపక్షాలపై దాడి.. ఇప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలు, రైతులపై రాళ్లదాడి.. వీటన్నింటికీ సీఎం తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top