బాబు వల్లే కరెంటు కస్టాలు - టీఆర్‌ఎస్


జిల్లాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం

నల్లగొండ లో టీడీపీ కార్యాలయానికి నిప్పు




ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారంటూ టీఆర్‌ఎస్ తీవ్రంగా మండిపడింది. తెలంగాణలో విద్యుత్ కోతలకు ఆంధ్ర పాలకులే కారణమంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఒకవైపు రాష్ట్రం కోతలతో అల్లాడుతుంటే, శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా వచ్చే విద్యుత్‌ను నిలిపేయాలంటూ కృష్ణా ట్రిబ్యునల్‌కు బాబు లేఖ రాయడం హేయమన్నారు. మంగళవారం పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో నేతలు, పార్టీ కార్యకర్తలు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.



పలు జిల్లాల్లో ఉద్రిక్తత: బాబు వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో బాబు దిష్టిబొమ్మలను దహనం చేశాయి. నల్లగొండ జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. ఫర్నిచర్, ఫ్లెక్సీలను దహనం చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు కూడా పోటీగా నిరసనలు చేపట్టి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దాడికి నిరసనగా బుధవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణలో కరెంట్ కష్టాలకు బాబే కారణమని మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్ రెడ్డి వేర్వేరుగా ధ్వజమెత్తారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top