శోభానాగిరెడ్డికి నివాళి


 ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకురాలు శోభానాగిరెడ్డి మృతిపార్టీకి తీరని లోటని ఆ పార్టీ నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శోభానాగిరెడ్డి సంతాప సభ గురువారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నగర అధికార ప్రతినిధి హెచ్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. శోభానాగిరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో పొంగులేటి మాట్లాడుతూ.. వైఎస్ మృతి అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి శోభానాగిరెడ్డి అండగా నిలిచారని, పార్టీలో కీల కంగా వ్యవహరించారని అన్నారు.



వైఎస్ విజయమ్మకు కుడి భుజంలా వ్యవహరించిన శోభమ్మ మృతి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ‘రాజన్న ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న జగనన్నకు శోభమ్మ అండగా ఉన్నారు. జగన్‌ను సీఎంగా చూడకుండానే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాధాకరం’ అని అన్నారు. సభలో పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి శ్రీలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముసా ్తఫా, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, నాయకులు విఎల్‌ఎన్.రెడ్డి, జిల్లేపల్లి సైదులు, భీమనాధుల అశోక్‌రెడ్డి, ఆకుల మూర్తి, వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఆరెంపుల వీరభద్రం, మేడా విజయ్‌కుమార్ పాల్గొన్నారు.



 అశ్వారావుపేట నియోజకవర్గంలో..

 శోభానాగిరెడ్డి మృతిపట్ల కుక్కునూరులో పార్టీ మండల కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహరాజు ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ సంతాప సభ జరిగింది. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, నాయకులు గంగుల రమణారెడ్డి, రాయి రవీందర్, పరవా రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



దమ్మపేటలో సంతాప సభ జరిగింది. హాజరైన నాయకులు, కార్యకర్తలు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. ఈ సభలో పార్టీ మండల అధ్యక్షుడు జూపల్లి ఉపేంద్రబాబు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.



 భద్రాచలం నియోజకవర్గంలో..

 భూమ శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా గురువారం భద్రాచలంలో సంతాపసభ జరిగింది. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలువేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సభలో నాయకులు కొవ్వూరి రాంబాబు, దామర్ల రేవతి, కొప్పినీడు నాని తదితరులు పాల్గొన్నారు.



 వెంకటాపురంలో పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేసి, అత్యవసర సమావేశం నిర్వహించి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సమావేశంలో నాయకులు చిట్టెం సత్యనారాయణ(ఎర్ర బాబు), పాండియన్ రాకేష్, యన్నమల్ల దాసు, జెజ్జరి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.



 చర్లలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రామగిరి యాకయ్య, నాయకులు కాళ్ల కృష్ణ, పొడుపుగంటి సమ్మక్క, తడికల అనుసూర్య తదితరులు పాల్గొన్నారు.



 ఇల్లెందు నియోజకవర్గంలో..

 శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా బయ్యారం మండల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు.



 టేకులపల్లిలోని పార్టీ కార్యాలయంలో సంతాప సమావేశం జరిగింది. హాజరైన వారంతా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఏలూరి కోటేశ్వరరావు, నాయకులు బట్టు శివ, నర్సింగ్ లక్ష్మయ్య, పెద్దబోయిన మదనయ్య తదితరులు పాల్గొన్నారు.



 పాలేరు నియోజకవర్గంలో..

 శోభానాగిరెడ్డి మృతిచెందారన్న వార్తతో కూసుమంచి మండలంలోని పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూసుమంచిలో సమావేశమయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం, శాంతియాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బజ్జూరి వెంకట రెడ్డి, నాయకులు జర్పుల బాలాజీనాయక్, పిట్టా సత్యనారాయణరెడ్డి, టి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 నేలకొండపల్లిలో సంతాపం సమావేశం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు కొర్లకుంట్ల నాగేశ్వరరావు, నాయకులు కోటి సైదారెడ్డి, పాకనాటి సంగీత, కాకమాను మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.



 మణుగూరు నియోజకవర్గంలో..

 మోరంపల్లి బంజరలో జరిగిన సంతాప సభలో నాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, జె.మల్లారెడ్డి, బత్తుల రామకొండారెడ్డి, కైపు నాగిరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. పార్టీలో శోభానాగిరెడ్డి మృతితో డైనమిక్ లీడర్‌ను పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

 శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు గ్రామంలో గురువారం రాత్రి శాంతి ర్యాలీ, స్కూల్ సెంటర్‌లో సంతాప సభ జరిగాయి. శోభానాగిరెడ్డి చిత్రపటం వద్ద  నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు మేడగం శ్రీనివాసరెడ్డి, కాటం వెంకట్రామిరెడ్డి, బానోతు రామదాసు, ఇమ్మడి రాము తదితరులు పాల్గొన్నారు.



 వైరా నియోజకవర్గంలో..

 శోభానాగిరెడ్డి మృతిపట్ల వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, వైరా అసెంబ్లీ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైరాలోని పార్టీ కార్యలయంలో ఏర్పాటైన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం ఆవిర్భావం నుంచి ఆమె కృషి చేశారని, వైఎస్‌ఆర్ కుటుంబానికి అండగా నిలిచారని నివాళులర్పించారు. ఆమె మృతితో శక్తిమంతురాలైన నాయకురాలిని పార్టీ కోల్పోయిందన్నారు  సంతాప సూచకంగా పార్టీ శ్రే ణులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. తొలుత, రెండు నిముషాలపాటు సభికులు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు బొర్రారాజశేఖర్, సూతకాని జైపాల్, తేలప్రోలు నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.



 జూలూరుపాడులో జరిగిన సంతాప సభలో పార్టీ మండల కన్వీనర్ పొన్నెకంటి వీరభద్రం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పూర్ణకంటి నాగేశ్వరరావు, నాయకులు దారావతు నాగేశ్వరరావు, కాళ్లూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.



 ఏన్కూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ముక్తి వెంకటేశ్వర్లు, నాయకులు నలమల శివకుమార్, నలమల వెంకటేశ్వరరావు, భూక్యా సక్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.



 శోభా నాగిరెడ్డి మృతికి సంతాపంగా కారేపల్లి మండలంలో పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించారు. కారేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సమావేశంలో నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, ఇమ్మడి తిరుపతిరావు, కోట సత్యానారాయణ, మండెపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



 మధిర నియోజకవర్గంలో..

ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద శోభానాగిరెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, నాయకులు లక్కిరెడ్డి నర్సిరెడ్డి, తల్లపురెడ్డి అంకాలరెడ్డి, శీలం అక్కిరెడ్డి, జంగా పుల్లారెడ్డి పాల్గొన్నారు.



 సత్తుపల్లి నియోజకవర్గంలో..

 శోభానాగిరెడ్డి మృతివార్త తెలియగానే కల్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసి, సంతాప సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ పాలెపు రామారావు, పట్టణ కన్వీనర్ కర్నాటి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 వేంసూరులో జరిగిన సంతాప సమావేశంలో పొంగులేటి మాధురి, పార్టీ మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, నాయకులు జంగా శ్రీనివాసరెడ్డి, గండ్ర నరోత్తమరెడ్డి, బాపూజీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top