ఊరు నిండా చీకటి

ఊరు నిండా చీకటి


- 718 పంచాయతీలలో వెలగని వీధి దీపాలు

- బిల్లులు కట్టలేదంటూ సరఫరా నిలిపేసిన ట్రాన్స్‌కో

- చెల్లించాల్సిన బకాయిలు రూ. 108 కోట్లు

- ఆందోళన చెందుతున్న సర్పంచులు

- చేతులెత్తేసిన విద్యుత్ అధికారులు

మోర్తాడ్: వీధి దీపాలకు సంబంధిం   చిన బకాయిల వసూలు కోసం ట్రాన్స్‌కో అధికారులు కొరడా ఝళిపించారు. బకాయిలు చెల్లిం   చడం లేదనే కారణంతో గురువారం రాత్రి ఒక్కసారిగా జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల పరిధిలో వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో జిల్లా అంతటా గ్రామాలలో చీకట్లు నిండుకున్నాయి. జిల్లాలోని మేజర్ పంచాయతీలు రూ.51 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ. 57 కోట్ల బకాయిలు విద్యుత్ సంస్థకు చెల్లించాల్సి ఉంది. గతంలోనే వీటి వసూలు కోసం వి ద్యుత్ ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను నిలపివేశారు.



ఎన్నికల సందర్భంలోనే వివిధ రాజకీయ పక్షాల విజ్ఞప్తి మేరకు ఒక్క రోజులోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అప్పట్లో రూ. 91 కోట్ల బకాయిలు పంచాయతీలు చెల్లిం   చాల్సి ఉంది. ఎన్నికల తరువాత ప్రభుత్వం ద్వారా లేక పంచాయతీ నిధుల నుంచో విద్యుత్ బకాయిలు చెల్లిస్తామని సర్పంచులు హమీ ఇవ్వడంతో సరఫరాను కొనసాగించారు. అయినా, బకాయిలు వసూలు కాకపోవడ ం, పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతో అధికారులు విద్యు    త్ సరఫరాను నిలిపివేశారు. గ్రామాల్లోని వీది దీపాలు వెలుగకపోవడంతో గ్రామాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో ఆం   దోళన చెందిన సర్పంచులు అధికారులను ఫోన్లలో వాకబు చే యగా ఉన్నతాధికారుల ఆదేశంతోనే   తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే సమాధానం లభించింది.

 

కఠిన నిర్ణయం తప్పలేదు

గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. బకాయిలను చెల్లించాలని సర్పంచులకు పలుమార్లు నోటీసులు జారీ చేశాం. వారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. నాలుగేళ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. బకాయిల వసూలు కోసం మాపై ఎంతో ఒత్తిడి ఉంది.                          -ప్రభాకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top