బది‘లీలల’పై వణుకు


ఖమ్మం : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బది లీలు, పదోన్నతుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్న సంఘటనలు పలుచోట్ల వెలుగుచూస్తున్నారుు. పలు జిల్లాల్లో అధికారులపై వేటు పడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖలోనూ వణుకు మొదలైంది.



కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలోనే

 మహబూబ్‌నగర్ డీఈవో రాజేష్‌ను సరెండర్ చేయడం, శనివారం వరంగల్ విద్యాశాఖ అధికారి చంద్రమోహన్ సస్పెన్షన్, మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిపై వేటుకు రంగం సిద్ధం కావడం...ఇవన్నీ జిల్లా విద్యాశాఖకు ఝలక్ ఇచ్చినట్లుగా అరుుంది.



 జిల్లాలోనూ పలు ఆరోపణలు

 ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పోస్టింగ్ ఇవ్వడంలో జిల్లాలో కూడా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నారుు. పలువురు అభ్యర్థులకు అన్ని అర్హతలు ఉన్నా పదోన్నతి ఇవ్వకుండా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని కొందరు ఉద్యోగులు తమ అనుచరులకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. మరికొందరు విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి తమ గోడు వినిపించారు. దీనికి తోడు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా పదోన్నతలు, బదిలీలు అస్తవ్యస్తంగా జరిగాయని, వీటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఫిర్యాదులు కూడా చేశారు.



జిల్లా నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఖాళీని ముందుగా చూపించకుండా పదోన్నతిపై వచ్చిన వారికి ఇవ్వడం, ఏజెన్సీ నుండి మైదాన ప్రాంతానికి వచ్చిన ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ఏజెన్సీ ప్రాంతంలో హెచ్‌ఎంల కౌన్సెలింగ్‌లో చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బదిలీల నిబంధన ప్రకారం అదే గ్రామపంచాయతీలో ట్రాన్స్‌ఫర్‌కు అనుమతించరాదనే నిబంధనకు విరుద్ధంగా వ్యవహరించారు. ఏజెన్సీ ప్రాంత పదోన్నతుల కౌన్సెలింగ్‌లో పెరిగిన పోస్టులను ఉపాధ్యాయలకు తెలియకుండా, ఆబ్‌సెంట్ పేరుతో తమకు నచ్చిన వారికి ఇచ్చార నే ఆరోపణలున్నారుు.



రేషలైజేషన్‌లో వివిధ పాఠశాలల్లో సీనియర్, జూనియర్ ఎవరో తేల్చకుండా అక్రమాలకు పాల్పడ్డారని, పదోన్నతి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నా సర్టిఫికెట్ చెల్లదనే నెపంతో అనుచరులకు పదోన్నతి కల్పించారనే ఆరోపణలు వస్తున్నారుు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర అధికారులు మిగిలిన జిల్లాలతోపాటు, జిల్లాలోని కౌన్సెలింగ్, పదోన్నతి జరిగిన తీరుపై తీగలాగితే అక్రమాల డొంక కదులుతుందనే ప్రచారం జరుగుతోంది.



 అంతా బాస్  చేశారు.. !

 ఇతర జిల్లాలకు భిన్నంగా జిల్లాలో పనిచేసిన విద్యాశాఖ అధికారి గత మూడు రోజుల క్రితం ఏపీకి బదిలీపై వెళ్లడంతో తమకేమీ కాదనే ఆలోచనలో జిల్లా విద్యాశాఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులున్నారు. బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలు జరిగి ఉంటే అంతా బాస్  కనుసన్నల్లోనే జరిగిందని చెప్పి చేతులు దుపులు కునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర అధికారుల దృష్టి జిల్లాపై పడితే పరిస్థితి ఏమిటి అని పలువురు అధికారులు ఆందోళన చెందుతుండటం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top