మమ్మీ....నొప్పి!

మమ్మీ....నొప్పి!


‘యశోద’లో చిన్నారుల ఆక్రందనలు

అత్యంత విషమంగా వరుణ్‌గౌడ్,వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి

 

 సాక్షి, హైదరాబాద్: ‘మమ్మీ.. కాలు కదలడం లేదు.. చేయి లేవట్లేదు.. ఒళ్లంతా నొప్పి.. తట్టుకోలేకపోతున్నా.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు.. డాడీకి ఫోన్ చేసి రమ్మను...’ ఐసీయూలోకి అడుగు పెట్టిన తల్లులను చూడగానే అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులు చేస్తున్న ఆక్రందనలివి.  క్షేమంగా తిరిగొస్తాడనుకున్న బిడ్డలు కళ్లముందే మృత్యువుతో పోరాడుతుంటే ఆ తల్లిదండ్రులు చూసి తట్టుకోలేకపోతున్నారు. లేత శరీరాలపై భారీ కుట్లు చూసి వారి హృదయాలు తట్టుకోలేక బోరున విలపిస్తున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం తల్లిదండ్రులు, బంధువులు పెద్దసంఖ్య లో శుక్రవారం యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.


 


వైష్ణవి(11), తరుణ్(7), వరుణ్‌గౌడ్(7)ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. శరత్(6), శ్రావణి(6), శిరీష అలియాస్ త్రిష(8), దర్శన్(6), ప్రశాంత్(6), నితుషా(7)ల పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు చెప్పారు. రుతికాగౌడ్(8), ఫాతిమా(9) ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు తెలిపారు. దర్శన్, కరుణాకర్, శివకుమార్, సందీప్, వరున్‌గౌడ్, ఫాతిమాలకు శస్త్ర చికిత్స చే శారు. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రకటించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top