పాపికొండల్లో పర్యాటకులకు చుక్కలు

పాపికొండల్లో పర్యాటకులకు చుక్కలు

- రద్దీ పెరగడంతో బోట్లు లేవన్న నిర్వాహకులు

భద్రాచలంలో టికెట్లు కొన్నా.. 500 మంది వెనక్కే

 

భద్రాచలం: పాపికొండల యాత్రకు వెళ్లిన పర్యాటకులకు ఆదివారం అక్కడి నిర్వాహకులు చుక్కలు చూపించారు. పరిమితికి మించి పర్యాటకులు రావటంతో అందుబాటులో బోట్లు లేవని నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో భద్రాచలం నుంచి టికెట్లు కొనుగోలు చేసి వెళ్లిన సుమారు 500 మంది పాపికొండల షికారుకు వెళ్లకుండానే వెనుదిరిగారు. వరుసగా సెలవులు రావటంతో పాపికొండల విహార యాత్రకు ఆదివారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. వీరంతా భద్రాచలంలోని ఏజెంట్ల వద్ద టికెట్లను కొనుగోలు చేసి, కొంతమంది తమ సొంతవాహనాల్లో, మరికొంతమంది అద్దె వాహనాల్లో వీఆర్‌ పురం మండలంలోని పోచవరం రేవుకు చేరుకున్నారు.



పాపికొండల యాత్రలో బోట్లు, లాంచీలు కలుపుకొని మొత్తం 26 ఉన్నాయి. వీటిలో సుమారు 2 వేల మందిని బోటు షికారుకు తీసుకెళ్తారు. అయితే ఆదివారం సుమారు 2700 మంది పర్యాటకులు వచ్చినట్లు టికెట్ల విక్రయాల ద్వారా లెక్క తేలింది. లాంచీల్లో కొంతమందిని సర్ధుబాటు చేసి, నిర్వాహకులు పంపించినప్పటికీ, అందరినీ పంపిస్తే పాపికొండల వద్ద మధ్యాహ్న భోజనాలకు ఇబ్బందులు ఏర్పడతాయని, సుమారు 500 మందిని వెనక్కి పంపించారు. దీంతో పర్యాటకులు లాంచీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top