ఇక టీఎస్‌ఆర్టీసీ పేరుతో బస్ టికెట్లు

ఇక టీఎస్‌ఆర్టీసీ పేరుతో బస్ టికెట్లు - Sakshi


ఆన్‌లైన్ టికెట్ల జారీకీ రెండు వెబ్‌సైట్లు  రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా జమపద్దులు

 

హైదరాబాద్:  అధికారికంగా విభజన జరగనప్పటికీ ఎక్కడి ఆదాయాన్ని అక్కడే ఖర్చు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఆర్టీసీ ఉమ్మడిగా కొనసాగుతుండటంతో జమాపద్దులు ఉమ్మడిగానే ఉంటున్నా యి. దీంతో ఏ ప్రాంత ఆదాయం ఎంతో, ఎక్కడి ఖర్చు ఎంతో స్పష్టంగా తెలియటం లేదు. ఆర్టీసీని ఆదుకునేందుకు కొన్నిరోజుల క్రితం సీఎం కేసీఆర్ రూ.250 కోట్ల గ్రాంటును మంజూరు చేశారు. కానీ లెక్కల గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో అన్ని రకాల జమాపద్దులను విడదీయాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్సుల్లో కండక్టర్లు అమ్మే టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ ప్రాంతానికి ఎంతో తెలుసుకోవటంలో ఇబ్బంది లేనప్పటికీ ఆన్‌లైన్ టికెట్ల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. దీంతో ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలనూ దేనికదే చేయాలన్న ఉద్దేశంతో రెండు రాష్ట్రాలకు విడివిడిగా సేవలు ప్రారంభించారు.



బుధవారం నుంచే ప్రయోగాత్మకంగా అమలు ప్రారంభించారు. ఇందుకోసం రెండు వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కొనే టికెట్లపై ఆంధ్రా ప్రాంతానికి సంబంధించినవైతే ఏపీఎస్‌ఆర్టీసీ అని తెలంగాణకు సంబంధించినవైతే టీఎస్‌ఆర్టీసీ అని ప్రత్యేకంగా సూచిస్తారు. ఇంతకాలం బస్సుల్లో అమ్మే టికెట్లపై ఏపీఎస్‌ఆర్టీసీ అని ఉండగా, వాటిని మార్చారు. తెలంగాణలో ఇక నుంచి టీఎస్‌ఆర్టీసీ అని ఉన్న టికెట్లనే జారీ చేయబోతున్నారు.  ఈ విషయంపై స్పష్టత ఇచ్చేందుకు ఆర్టీసీ జేఎండీ రవుణారావు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జమాపద్దులను విడదీశామని, గ్రాం టునూ వెంటనే అందజేస్తే ఆర్టీసీకి ఉపయోగపడుతుందని ఆయన సీఎం దృష్టికి తెచ్చారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top