రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం


దోరకుంట(కోదాడరూరల్)

 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని కోదాడ, కొండమల్లేపల్లి, చౌటుప్పల్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. కోదాడ మండల పరిధి దోరకుంటకు చెందిన బుయ్యా జగ్గయ్య ధనలక్ష్మి దంపతుల రెండో కూమారుడైన మహేష్(16) స్థానిక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తన మిత్రులతో కలిసి చెరువు వైపు బహిర్భుమికి వెల్లి తిగి వచ్చే క్రమంలో  జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న గుర్తు తెలియని కారు వేగంగా ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై మెదడు బయటపడి అతను అక్కడిక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తండ్రి జగ్గయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేపుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చరమందరాజు తెలిపారు.

 

 కొండమల్లేపల్లి :

 చివ్వెంల మండలం వాల్యాతండాకు చెందిన ధరావత్ రాజు (25) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ నుంచి దేవరకొండకు వస్తుండగా కొండమల్లేపల్లి పట్టణ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపుగా వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో రాజును దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రాజు పరిస్థితి విషమంగా ఉందని తెలి పారు. దీంతో అతడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య గర్భవతి.  మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖలీల్‌ఖాన్ తెలిపారు.

 

 కంటైనర్‌ను ఆటో ఢీకొని..

 చౌటుప్పల్: ఆత్మకూరు(ఎస్) మం డలం రామన్నగూడెం గ్రామానికి చెందిన సామ కృష్ణారెడ్డి(22) చిట్యాల మండ లం ఏపూరులో నివాసముంటున్నాడు. టాటాఏస్ ఆటో నడుపు తూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు దినపత్రికలను ఆటోలో తరలిస్తున్నాడు. రోజులాగే గురువారం అర్ధరాత్రి ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. చౌటుప్పల్ మండలం పంతంగి శివారులోని రాగానే, ముం దున్న కంటైనర్ లారీడ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, ఆటోను వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీ సులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top