మేమున్నామం

మేమున్నామం - Sakshi


‘‘నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తా.. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే నా పళ్లతో తీసేస్తా.. ఏ ఆపద వచ్చినా ఒక్క ఫోన్ చేయండి.. రెక్కలు కట్టుకుని వాలిపోతా.. హరిహరాదులు అడ్డం పడినా ప్రజలకు ఇచ్చిన మాట తప్పను.. మడమ తిప్పను’’.. అంటూ పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని చాటి చెప్పారు. మాసాయిపేట దుర్ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యలు ముమ్మరం చేయించారు. మనసున్న మారాజుల్లా బాధితులను ఓదార్చారు. చిన్నారుల మృతితో సర్వం కోల్పోయి కన్నీటి సంద్రంలో మునిగిపోయిన వారికి మేమున్నామంటూ భరోసా కల్పించారు.

 

మెదక్: మాసాయిపేట.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. జూలై 24న ఇక్కడ జరిగిన దుర్ఘటన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టడంతో 16 మంది చిన్నారులతో పాటు బస్ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలు అనంతలోకాల్లో కలిసిపోయిన రాక్షస క్షణాలవి. ప్రమాద స్థలి వద్ద తెగిపడిన అవయవాలు.. నుజ్జునుజ్జైన శరీరాలు.. రక్తమోడిన రైల్వేట్రాక్... భీతావహ వాతావరణాన్ని తలపించింది.

 

విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, గీతారెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ప్రజాయుద్ధ నౌక గద్దర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు.

 

అయ్యో కొడుకా...

ప్రమాదంలో మరణించాడనుకున్న చిన్నారి ధనుష్ దుర్ఘటన జరిగిన మరుసటి రోజు పునర్జన్మ ఎత్తడంతో వారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరో పక్క తమ కొడుకు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడనుకున్న దత్తు తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వీరిని మంత్రి హరీష్‌రావు తన కారులో హుటాహుటిన హైదరాబాద్ నుంచి కిష్టాపూర్‌కు తీసుకెళ్లారు. నాలుగు రోజులుగా బాధిత కుటుంబాల వెంటే ఉంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు.

 

విరాళాలతో చేయూత...

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు సీఎం ప్రకటించిన రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చిన రూ.2 లక్షల మొత్తాన్ని చెక్కుల రూపంలో వారికి అందజేశారు. మంగళవారం వైఎస్సార్ సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తెల ంగాణ రాష్ట్ర పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్ర భుగౌడ్, రాఘవరెడ్డి తదితరు లు బాధిత కుటుంబాలను ప రామర్శించి ఆర్థికసాయం చేశా రు. టీడీపీ తరఫున మృతుల కు టుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేల పరి హారం ప్రకటించి మానవతా ధృక్పతాన్ని చాటా రు. కేర్ ఆస్పత్రి సిబ్బంది కూ డా తమ ఒక్క రోజు వేతనాన్ని సాయంగా ప్రకటించారు.

 

విద్యార్థి లోకం నివాళి...

అన్ని గ్రామాల్లో విద్యార్థులు బంద్ పాటించి కొవ్వొత్తులతో ర్యాలీలు తీసి నివాళులు అర్పిం చారు. ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన యు వకులంతా పెద్ద ఎత్తున యశోద ఆస్పత్రికి తరలివెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెం దిన విద్యార్థిని నాగలక్ష్మి తన చదువు కోసం దాచుకున్న రూ.16 వేలను బాధిత కుటుంబాలకు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top