ఎస్‌బీహెచ్‌లో చోరీ


దేవరకద్ర : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాంకు కిటికీలోంచి చొరబడి రెండు కంప్యూటర్ మానిటర్లను, రైస్‌మిల్లు లోని ల్యాప్‌టాప్, కొంత నగదు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం దేవరకద్రలోని స్టేట్ బ్యాంకు హై దరాబాద్ (ఎస్‌బీహెచ్) ను తెరిచిన సిబ్బంది సాయంత్రం మూసివేసి ఇంటికి వెళ్లారు. అదే అర్ధరాత్రి దుండగులు బ్యాంకు మేనేజర్ గది కిటికీఊచలు తొల గించి లోపలికి ప్రవేశించి రెండు కంప్యూటర్ మానిటర్లను ఎత్తుకెళ్లారు.



ఎప్పటిలా గే మంగళవారం ఉదయం మొదట ఊ డ్చేవారు సిబ్బంది వచ్చి శుభ్రం చేస్తుం డగా వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే మేనేజర్ ప్రసాద్‌రెడ్డితో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం సంఘటన స్థలాన్ని ఆత్మకూర్ సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ వినయ్‌రెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కిటి కీ తలుపులకు గొళ్లెం వేయకపోవడం వల్లే ఇనుపచువ్వలను తొలగించి లోపలికి దొంగలు ప్రవేశించినట్టు భావిస్తున్నారు. అక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల దొంగల ఆచూకీ సీసీ ఫుటేజీల్లో కనిపించలేదు. మేనేజర్ గదికి రెండు వైపులా తాళాలు వేయడం వల్ల బ్యాంకు లోపలికి దొంగలు ప్రవేశించలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనతో బ్యాంకు లావాదేవీలు మధ్యాహ్నం వరకు సాగకుండా మూసివేశారు. మరో సంఘటనలో కోయిల్‌సాగర్‌రోడ్డులో ఉన్న కన్నయ్యరైస్ మిల్లులో దొంగలుపడి లాప్‌టాప్, టేబుల్ సొరగులను పగులగొట్టి అందులో ఉన్న *1,500 ఎత్తుకెళ్లారు. ఒకేసారి రెండుచోట్ల జరిగిన దొంగతనంలో కంప్యూటర్‌లే పోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top