ఆస్తిపన్ను వసూళ్లలో అగ్రస్థానం


టవర్ సర్కిల్ : ఆస్తిపన్నుల వసూళ్లలో కరీంనగర్ నగరపాలక సంస్థ నాలుగేళ్లుగా వరంగల్ రీజియన్‌లోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. పక్కా ప్రణాళికతో పన్నులు వసూలు చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్దేశిత లక్ష్యం సాధిస్తున్నారు. దీనికితోడు ఈఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలు వడ్డీమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ప్రజలు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పన్నులు చెల్లిస్తూ కార్పొరేషన్‌కు సహకరిస్తున్నారు.



2014-15 ఆర్థిక సంవత్సరానికి 94.5శాతం పన్నులు వసూలు చేశారు. ప్రభుత్వ సంస్థల బకాయిల వసూలు ఇబ్బందికరంగా తయారైనా ప్రజల సహకారంతో కార్పొరేషన్ ప్రథమస్థానంలో నిలుస్తోంది. మొదటి అర్ధ సంవత్సరం వసూళ్లు ఆశాజనకంగా లేకపోయినా ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలైన ఫిబ్రవరి, మార్చిలో వసూళ్లు ఊపందుకున్నారుు. బిల్‌కలెక్టర్లు ఇంటింటా తిరగకున్నా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తున్నారు.

 

జోరందుకున్న నిర్మాణ రంగం..

నాలుగేళ్లుగా నగరంలో నిర్మాణ రంగం జోరందుకుంది. కార్పొరేషన్‌కు ఆదాయ వనరులు పెరిగాయి. అరుునా, వసూళ్లు తగ్గడంలేదు. అందుకు తగిన విధంగానే సిబ్బంది పనిచేస్తున్నారు. 2011-12లో కరీంనగర్ కార్పొరేషన్ 96శాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రస్థాయి రికార్డు సొంతం చేసుకుంది. కరీంనగర్ బల్దియా పన్నుల వసూళ్లలో నాలుగేళ్లుగా వరంగల్ రీజియన్ స్థాయి మున్సిపాలిటీలు, కారొపరేషన్లలో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది.

 

బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ.18 లక్షలు

నగరపాలక సంస్థకు ఆరేళ్లుగా బకాయి పడ్డ రూ.18 లక్షల ఆస్తి పన్నును బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు మంగళవారం చెల్లించారు. అరుుతే, మిగతా ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు రూ.4కోట్ల పన్ను బకారుులు రాబట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. వడ్డీమాఫీ పథకం అమలులోకి వచ్చిన నాటి నుంచి పలు కార్యాలయాలకు పన్ను డిమాండ్‌తో పాటు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. ఏప్రిల్ 1 నుంచి యథావిధిగా వడ్డీతో సహా పన్ను బకారుులు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

 

పన్ను వసూళ్ల వివరాలు

ఆర్థిక సంవత్సరం        పన్ను వసూలు (శాతంలో..)

 2014-15            94.5

 2013-14            90

 2012-13            92

 2011-12            96

 2010-11            93

 2009-10            94

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top