మాకు న్యాయం చేయండి


నేరెళ్ల బాధితుల డిమాండ్‌

వేములవాడ:  మాకు న్యాయం చేయాలంటూ నేరెళ్ల బాధితులు వేడుకుం టున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న పెంట బానయ్య, కోల హరీశ్, చిట్యాల బాలరాజు, బత్తుల మహేశ్, పసుల ఈశ్వర్‌కుమార్, గంధం గోపాల్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ తమను అన్నివిధాలా ఆదుకుంటా నని హామీ ఇచ్చారన్నారు.



మంత్రి ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం చేయించాలని, పరిహారం ఇవ్వా లని, పునరావాసం కల్పించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలన్నారు. కండిషన్‌ బెయిల్‌ ఎత్తివే యాలని కోరారు. 40 రోజుల తర్వాత వచ్చిన వరంగల్‌ ఎంజీఎం డాక్టర్లకు మానిన గాయాలు ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. తమ ఒంటినిండా దెబ్బలే ఉన్నాయని, కరెంటు షాక్‌ కూడా పెట్టా రని తెలిపారు. జైలులో ఉన్న సీసీ కెమెరా పుటేజీలు పరిశీలిస్తే నెలరోజుల క్రితం మా పరిస్థితి అర్థమవుతుందన్నారు.  



నేరెళ్లను శ్మశానం చేసిండ్రు

దళిత ఆదివాసీల సంఘాల ఐక్యవేదిక నిజనిర్ధారణ కమిటీ

వేములవాడ: ఇసుక లారీల స్వైర విహారం... ఇసుక మాఫియా ఆగడాలు నేరెళ్ల గ్రామాన్ని శ్మశానంలా మార్చాయని దళిత ఆదివాసీల సంఘాల ఐక్యవేదిక నిజనిర్ధారణ కమిటీ ఆరోపించారు.



కమిటీ నాయకులు జనశక్తి చర్చల ప్రతినిధి చంద్రన్న, తెలంగాణ దళిత అలయన్స్‌ ప్రతినిధి చార్లెస్‌ వెస్లీ, దళిత స్టూడెంట్‌ ఫ్రంట్‌ ప్రతినిధి పి.శంకర్, తెలంగాణ దళిత సమాఖ్య ప్రతినిధి బి.రామ్మోహన్, దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ప్రతినిధి సి.రఘుపతిరావు, సీఏఎస్‌ఏ(కాస) ప్రతి నిధి ఎన్‌.ప్రేమ్‌కుమార్, డీబీఎస్‌ ప్రతినిధి ఎగొండ స్వామి, టీఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ ప్రతి నిధి ఎర్ర నరసింహలు శుక్రవారం వేముల వాడ ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరా మర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జిల్లా ఎస్పీని ముందుగా సస్పెండ్‌ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యు లపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యా ప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top