ఉన్న భూములు గుంజుకున్నారు

ఉన్న భూములు గుంజుకున్నారు

- మూడెకరాలు ఇస్తామని మభ్యపెట్టారు

ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు

‘మిషన్‌ కాకతీయ’తో దళితులకు అన్యాయం 

వీధిన పడిన 22 దళిత కుటుంబాలు

 

అల్లాదుర్గం (మెదక్‌): ‘‘దళితుల అభ్యున్నతి కోసం ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని సర్కారు చెబుతోంది. కానీ, మేము సాగు చేసుకుంటున్న భూములను తీసుకుని మాకు అన్యాయం చేస్తోంది’’ అంటూ వాపోతున్నారు మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన దళితులు. తమకు న్యాయం చేసి వెంటనే భూములు ఇప్పించాలని కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారు. బుధ వారం కూడా వారు అల్లాదుర్గం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి మొర పెట్టుకున్నారు. ముప్పారం గ్రామానికి చెందిన 22 దళిత కుటుంబాలు 2000 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్‌ అందించిన రుణ సహాయంతో నల్లకుంట చెరువులోని సర్వే నంబర్‌ 25, 26లో ఎకరం చొప్పున వ్యవసాయ భూము లను కొనుగోలు చేసుకున్నాయి. వ్యవసా యం చేసుకుంటున్నారు.



 రుణాలను సైతం తిరిగి చెల్లించారు. ప్రభుత్వం వారికి పట్టాల ను కూడా అందజేసింది.  మొదటి విడత మిషన్‌ కాకతీయలో భాగంగా కాంట్రాక్టర్‌ వెం టనే చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. దళితులు సాగు చేసుకుంటున్న భూములు చెరువు పరిధిలోనే ఉన్నాయి. పూడికతీతతో ఆ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో దళిత కుటుం బాలన్నీ కలసి మిషన్‌ కాకతీయ పనులను అడ్డుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నేతలు, ఆర్డీఓ అక్కడికి చేరుకున్నారు. కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నా యం గా ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పు న వేరే చోట భూములు ఇస్తామని నచ్చ జెప్పారు. వారి మాటలను విశ్వసించిన దళితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

 

ఏం జరిగింది?

చెరువు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మూడేళ్లు గడిచిపోయాయి. 22 దళిత కుటుం బాలు భూములు కోల్పో యాయి. ‘ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలతో కొనుగోలు చేసిన ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్లం. ఆ భూమి చెరువు పనిలో పోవ డంతో ఆధా రం పోయింది. అప్పులు చేసు కుంటూ బతకాల్సి వస్తోంది’ అని  దేవమ్మ అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top