ఇక ఈ-మార్కెటింగ్

ఇక ఈ-మార్కెటింగ్


వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు

ఆన్‌లైన్‌లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు

ఎలక్ట్రానిక్ కాంటాల ఏర్పాటుకు చర్యలు

ధరల నియంత్రణ, అక్రమాలకు అడ్డుకట్ట

రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో చెల్లింపులు

 జిల్లాలో ఎనిమిది మార్కెట్ యార్డులలో అమలు




 పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ధరల నిర్ణయం లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖలో సంస్కరణల కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వ్యవసాయ మా ర్కెట్ యార్డుల్లో సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిం చేందుకు నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్(నామ్) విధానాన్ని ప్రవేశపెట్టి ఇంటర్నెట్ అనుసంధానంతో ఆన్‌లైన్ కొనుగోళ్లకు రూపకల్పన చేసింది.

 

కరీంనగర్ అగ్రికల్చర్ : మార్కెట్ యూర్డుల్లో ప్రధానంగా వరి, పత్తి, మక్కలు, కందులు, పెసర్లు తదితర పంటల ఉత్పత్తులు మాత్రమే అమ్మకానికి వస్తున్నాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని తమ ఉత్పత్తులు తీసుకువచ్చిన అన్నదాతలకు మార్కెట్‌యార్డులో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దళారుల బెడద, ఇష్టారీతిగా ధరల నిర్ణయం, తూకంలో మోసాలతో రైతులు దగాపడుతూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మార్కెట్‌యార్డులు, సబ్‌మార్కెట్ యార్డులతో పాటు కొత్తగా మంజూరైన వాటితో కలిపి 35 మార్కెట్ యార్డులున్నాయి. ఇందులోని ప్రధాన మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తూ రైతులను మోసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నారుు. మార్కెట్ యార్డులలో క్రయవిక్రయాలు జరపడానికి అవకాశాలున్నప్పటికీ వ్యాపారులకు, కమీషన్‌దారులకు పాలకవర్గం అండదండలు ఉండటం, నేతల ఒత్తిళ్ల కారణంగా మార్కెట్ పరిధిలో అమ్మకాలు తగ్గిస్తూ రైతుల ఇళ్ల వద్దే దోపిడీ సాగిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న సర్కారు మార్కెట్‌యార్డులలో సాంకేతిక సంస్కరణలకు తెరతీసింది.





తొలిదశలో ఎనిమిది మార్కెట్లు

నామ్ కింద తొలిదశలో జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లు ఎంపికయ్యూరుు. అందులో కరీంనగర్, జమ్మికుంట, జగిత్యాల, పెద్దపల్లి, చొప్పదండి, గంగాధర, మెట్‌పల్లి, గొల్లపల్లి మార్కెట్లున్నాయి. ఆయా మార్కెట్లలో ఆన్‌లైన్ కొనుగోళ్లకు వసతుల కోసం ప్రభుత్వం ఒక్కో మార్కెట్‌కు రూ.30 లక్షల నిధులు కేటాయించింది. కంప్యూటర్లు, ఎల్‌ఈడీ మానిటర్లు, ఇతర సామగ్రిని సమకూర్చే పనిలో మార్కెటింగ్‌శాఖ నిమగ్నమయ్యింది.  ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ యార్డులకు ఎలక్ట్రానిక్ కాంటాలు అందించనున్నారు. తూకం, తక్‌పట్టీలు (ఈ-బిల్లింగ్) ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానం వచ్చే రబీ సీజన్‌లో అమలు చేసే అవకాశాలున్నాయి. దశలవారీగా జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్కెట్‌యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా జరిగే క్రయవిక్రయాలు ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తారు. రైతులు మార్కెట్‌కు ఉత్పత్తులు తీసుకురాగానే చీటి ఇచ్చి వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రైతులు విక్రయించిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో గ్రేడ్‌లవారీగా నమోదు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా లెసైన్స్ ఉన్న వ్యాపారులు ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే అవకాశాలున్నాయి. మార్కెట్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నామ్ నుంచి అనుమతి తీసుకుంటే దాని పరిధిలోని మార్కెట్లలో ఎక్కడైనా కొనే అవకాశం కల్పించనున్నారు.





ఆన్‌లైన్‌లో చెల్లింపులు

వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు అమ్ముకునే రైతులకు ఆన్‌లైన్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకానున్నాయి. ఇప్పటికే సీసీఐ ఆద్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఆన్‌లైన్ విధానం అమలు చేశారు. గత సీజన్‌లో వరి ధాన్యానికి ఇదే పద్ధతిలో చెల్లింపులు చేశారు. కొంతమందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో చెక్కుల ద్వారా చెల్లింపులు జరిపారు. ఇలా చెక్కుల కోసం మార్కెట్‌యార్డుల చుట్టూ అన్నదాతలు తిరగాల్సిన అవసరం రాదు. ఉత్పత్తులు కొనుగోలు చేయగానే రైతులకు సమాచారం అందుతుంది. సంబంధిత అధికారులు డబ్బులు జమ చేయగానే వారి ఫోన్‌లో మెసేజ్ వస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసే నేపథ్యంలో మార్కెట్‌రంగంలో సాంకేతిక పద్ధతులు రావడం రైతులకు కొంత మేలు జరగనుంది. ఆన్‌లైన్ వ్యవస్థతో వ్యాపారులు ఎక్కువ మంది పోటీలో ఉంటారు కాబట్టి ధర నిర్ణయంలో గతంలో కంటే మెరుగుదల ఉండే అవకాశముంది. పంట ఉత్పత్తుల వివరాలన్నీ కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తుండడంతో మోసాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. అక్రమ నిల్వలకు అడ్డుకట్ట పడుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top