పంటలు వేయునివారికి మాఫీ లేదు

పంటలు వేయునివారికి మాఫీ లేదు - Sakshi


మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పోచారం, ఈటెల స్పష్టీకరణ

 

హైదరాబాద్: పంట రుణాలు తీసుకుని పంటలు వేయని వారికి, భూమి లేని వారికి రుణ  మాఫీ వర్తించదని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు పంటలు వేయకుండా, భూమి లేకుండానే దొంగ పాస్‌పుస్తకాలతో పంట రుణాలు తీసుకున్నట్టు ప్రభుత్వ విచారణలో తేలిందన్నారు. అలాంటివారిని ఏరివేసిన తర్వాతే రుణ మాఫీ అమలు చేస్తామన్నారు. రుణ మాఫీపై అధ్యయనం కోసం పోచా రం నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో సవూవేశమై చర్చించిం ది. సమావేశం అనంతరం జోగు రామన్నతో కల సి పోచారం, ఈటెల విలేకరులతో మాట్లాడారు. ‘‘రుణ మాఫీపై ఇప్పటికే 99 శాతం స్పష్టత వచ్చింది. సీఎం కేసీఆర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాక 100 శాతం స్పష్టత వస్తుంది’’ అని పోచారం పేర్కొన్నారు.



బంగారంపై తీసుకున్న రుణాల్లో 7 శాతం వడ్డీ గలవాటినే మాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 35  నుంచి 36 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 15 నుంచి 16 వేల కోట్ల పంట రుణాలున్నాయని వెల్లడిం చారు. కాగా రైతుల రుణమాఫీ అమలుకు సం బంధించి మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం తన నివేదికను సీఎం  కేసీఆర్‌కు ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బ్యాంకులకు నేరుగా సగం వరకు  రైతుల రుణ బకాయిలు చెల్లించి వారికి కొత్త రుణాలు ఇచ్చేలా  చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top