రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

రైలు పట్టాలపై యువకుడి మృతదేహం


ఖమ్మం క్రైం: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైల్వే ఎస్‌ఐ రవిరాజ్ తెలిపిన ప్రకారం... నగరంలోని సారధినగర్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్టుగా అందిన సమాచారంతో రైల్వే, ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ త్రీ టౌన్ పోలీసులు వెళ్లిపోయూరు. మృతుడి దుస్తులను రైల్వే పోలీసులు పరిశీలించారు. స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జి రశీదులు, క్యాటరింగ్ విజిటింగ్ కార్డులు కనిపించారు.



ఈ కార్డులపై ఉన్న క్యాటరింగ్ యజమానుల ఫోన్ నంబర్లకు పోలీసులు ఫోన్ చేశారు. క్యాటరింగ్ యజమానులు వచ్చి అతడిని గుర్తించారు. అతడి పేరు భూక్యా రమేష్(25) అని, తమ వద్ద పనివాడిగా పనిచేస్తున్నాడని చెప్పారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో కొత్తగూడెం మండలం సుజాతనగర్ పంచాయతీలోని కోమటిపల్లి గ్రామంలో ఉంటున్న రమేష్ తండ్రి థావుర్యా, సోదరులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఇతడికి మతిభ్రమించిందని, ఇంటి వద్ద ఉండడదని, ఎప్పుడూ ఏదో ఒక ఊరు వెళుతుంటాడని, 15 రోజుల క్రితం ఇంటికి వచ్చి వెళ్లిపోయూడని చెప్పారు. ఇష్టానుసారంగా తిరుగుతుండడంతో పెళ్లి కూడా చేయలేదని, పట్టించుకోవడం మానేశామని, అతనికి ఎవరూ శత్రువులు లేరని చెప్పారు.



కొట్టి చంపారా..?

రమేష్‌ను ఎవరో కొట్టి చంపి, వృుతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైలు పట్టాల పక్కనున్న రాళ్లపై అక్కడక్కడరక్తపు మరకలు, పగి లిన బీరు సీసాలు ఉన్నారుు. వృుతుడి తలపై రాళ్లతో కొట్టినట్టుగా గాయాలున్నాయి. ఒక సైజు రాయిపై రక్తం మరక ఉంది. వృుతుడి మెడలోని దారంతో గొంతుకు బిగిసినట్టుగా ఉంది. నోటి నుంచి నాలుక బయటకు వచ్చింది. అతనిని దుండగులు తలపై బండ రాయితో కొట్టి, మెడలోని దారంతో ఉరి వేసి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వృుతదేహాన్ని పట్టాలపై పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.



ఈ ప్రదేశం నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో గొడవ జరిగినట్టుగా అరుపులు వినిపించాయని స్థానికులు చెప్పారు. వృుతదేహాన్ని రెల్వే సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. అనుమానాస్పద వృుతిగా రైల్వే పోలీసులు కేసు కింద నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం వృుతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈ వృుతిపై రైల్వే ఎస్సై రవిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకృబందం దర్యాప్తు జరుపుతోందని సీఐ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top