వలసలు నివారించడమే లక్ష్యం

వలసలు నివారించడమే లక్ష్యం - Sakshi


70టీఎంసీల నీటిని నిల్వచేసుకుందాం

పరిశ్రమలు స్థాపించే వారిని అడ్డుకోవద్దు

ఎంపీ ఏపీ.జితేందర్‌రెడ్డి

 

 అడ్డాకుల : కరువు జిల్లాగా పేరొందిన పాలమూరు నుంచి కూలీల వలసలను నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భా గంగా జిల్లాలో 70టీఎంసీల నీటిని నిల్వచేసుకుని జిల్లాలో 14 లక్షల ఎకరాలకు సాగునీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మండలంలోని అడ్డాకుల, కాటవరం, గాజులపేట గ్రా మాల్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.



పరిశ్రమలు ఏర్పాటు చేసే వారిని అధికారులు ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై సీఎం కేసీఆర్ నిపుణులతో చర్చిస్తున్నారని త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. ఒక్కపైసా అవినీతి జరగకుండా కేసీఆర్ పరిపాలిస్తున్నందున అందరూ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఎంపీ జితేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు నీళ్లందిస్తామన్నారు.



కార్యక్రమాల్లో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వెంకటయ్యగౌడ్, స్నేహాఫామ్స్ అధినేత రాంరెడ్డి, ఎంపీపీలు బగ్గి కమలమ్మ, ఈవీ గోపాల్, జెడ్పీటీసీ సభ్యుడు రామన్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు మైమూద్, పార్టీ మండల అధ్యక్షుడు నాగార్జున్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, సర్పంచులు కె.రఘు, వడ్డే నర్సమ్మ, సరస్వతమ్మ, నాగిరెడ్డి, ఇంద్రయ్యసాగర్, భాస్కర్‌గౌడ్, వైస్ ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి, శ్రీనివాసులు, శెట్టిశేఖర్, హేమ్లీ, స్నేహాఫామ్స్ నిర్వాహకులు రామేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top