తక్షణం రైతులను ఆదుకోవాలి

తక్షణం రైతులను ఆదుకోవాలి - Sakshi


ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ డిమాండ్

 


హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, విద్యుత్ కష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంక్షోభంలో ఉన్న తెలంగాణకు విద్యుత్ ఇచ్చి ఆదుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు రాలేదని, విద్యుత్ ఇప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నారే తప్ప.. సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని విమర్శించింది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడాన్ని నివారించేందుకు పార్టీపరంగా వ్యూహాన్ని రూపొందించాలని నిర్ణయించింది.



శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాష్, జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, హెచ్‌ఏ రెహ్మాన్ పాల్గొన్నారు.



ఆదుకోకపోవడం దురదృష్టకరం:పొంగులేటి



విద్యుత్ కష్టాల్లో ఉన్న తెలంగాణను కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఆదుకోకపోవడం దురదృష్టకరమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ నీటిని విద్యుత్ కోసం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top