విద్యుత్ ఇచ్చేవరకు శ్రీశైలంలో ఉత్పత్తి ఆపేది లేదు


 జెడ్పీసెంటర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా రావలసిన విద్యుత్ వాటా ఇచ్చే వరకు శ్రీశైలంలో విద్యుత్  ఉత్పత్తిని ఆపేది లేదని ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు విద్యుత్ ఇవ్వకుండా మోడీ, చంద్రబాబులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. విభజన చట్టంలో ఏపీ 54 శాతం, కేంద్రం నుం చి 2వేల మేగా వాట్ల విద్యుత్ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నా పట్టించుకోవడం లేదన్నారు.

 

 దీనిపై బీజేపీ నాయకులు కేంద్రంపై ఎందుకు వత్తిడి తేవడం లేదని ప్రశించారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని తెలిసినా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని కృష్ణా బోర్డుకు చంద్రబాబు లేఖ రాయడం దారుణమన్నారు. తెలంగాణకు 6 వేల మెగా వాట్ల విద్యుత్ అవసరం కా గా, 4300మెగా వాట్లు అందుబాటులో ఉందన్నారు. శ్రీ శైలంలో 700 మెగా వాట్లలో సగం, క్రిష్ణపట్నంలో 400 మెగావాట్లు, సీలేరులో 300 మెగావాట్ల విద్యుత్ వస్తేనే  సమస్య తీరుతుందన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ  అండగా ఉండకపోగా తమ రాజకీయాల కోసం ప్రజలను బలి చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను దెబ్బ తీసేందుకు తెలంగాణ రైతుల ఉసురు పోసుకోవడం మంచిది కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. సమావేశంలో గ్రంధాలయ చైర్మన్ సాయిరెడ్డి, సురేందర్‌రెడ్డి, పురేందర్‌నాథ్, బెనహర్ పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top