సార్..ఉద్యోగం ప్లీజ్..
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశాను.. ఎన్నో త్యాగాలు చేశాను.. ఇప్పుడు తెలంగాణ వచ్చింది..నాకు ఉద్యోగం రాలేదు.. ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్ అంటూ ఓ యువకుడు కనిపించిన నాయకుడినల్లా అడుగుతున్నాడు. గజ్వేల్ నియోజకవర్గం చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు తాను ఉద్యమ కాలంలో చేసిన పోరాటాలకు సంబంధించి వార్తాపత్రికల్లో ప్రచురితమైన దృశ్యాలను వారికి చూపుతూ ఇలా వివరిస్తున్నాడు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటినుంచీ తాను నాయకులను కలుస్తున్నానని చెప్పాడు. సోమవారం ఖైరతాబాద్‌లో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మరో మహిళా నేతను కలిసి ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నాడు.