మెడిసిన్ టాపర్స్ వీరే
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మెడిసిన్ లో 85.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ లో అమ్మాయిలు సత్తా చాటారు. ప్రకాశం జిల్లా నాగులపాలెంకు చెందిన ఉప్పలపాటి ప్రియాంక 160 మార్కులకు 160 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. 159 మార్కులతో పాడ శ్రీవిధూల్ రెండో ర్యాంకు దక్కించుకుంది. 159 మార్కులు సాధించిన వంగాల అనూహ్య మూడో ర్యాంకు, 158 మార్కులు సాధించిన పారసెల్లి సాయి తేజ నాలుగు ర్యాంకు, 158 మార్కులతో చెన్నూరి సాయి తేజారెడ్డి ఐదో ర్యాంకులో నిలిచారు.
టాప్ టెన్ ర్యాంకర్స్
6. పైడి తేజేశ్వరరావు(158)
7. పొన్నాడ నాగసత్య వరలక్ష్మి(158)
8. బాలబోలు కీర్తన షణ్మఖ(158)
9. ఆన్షి గుప్తా(158)
10. సిరంశెట్టి సాయిప్రీతమ్(158)