అమరులైన పోలీసులకు భారీ ఎక్స్గ్రేషియా

అమరులైన పోలీసులకు భారీ ఎక్స్గ్రేషియా - Sakshi


హైదరాబాద్ : విధి నిర్వహాణలో అమరులైన పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా భారీగా పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... విధి నిర్వహాణలో కానిస్టేబుల్ ఆపై సిబ్బంది మరణిస్తే రూ. 25 లక్షల నుంచి  రూ. 40 లక్షలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రూ. 30 లక్షలు నుంచి రూ. 45 లక్షలు డీఎస్పీ స్థాయి అధికారికి రూ. 30 లక్షల నుంచి  రూ. 50 లక్షలు, అలాగే ఐపీఎస్ అధికారులకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి పెంచుతున్నట్లు వెల్లడించారు.


ప్రస్తుతం కానిస్టేబుళ్లకు రోజువారి చెల్లిస్తున్ జీతం రూ. 90 నుంచి రూ. 250కి పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య భద్రత కింద ప్రస్తుతం ఉన్న రూ. లక్షను రూ. 5 లక్షలు పెంచుతున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండేది పోలీసులేని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు దేవునితో సమానమన్నారు. పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికి అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సింగపూర్ తరహాలో పోలీసులు వ్యవస్థను పటిష్ట పరుస్తామన్నారు.


సమాచార వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని తెలిపారు. ప్రజలు ధన,మాన, ప్రాణలను సంరక్షించడంలో విజయం సాధించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, హోం మంత్రి నాయని నరసింహరెడ్డితోపాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top