హెరిటేజ్ కల్తీ పాలపై నిషేధం విధించాలి


కల్తీపాలు ఆరోగ్యానికి హానికరం. కేరళలో హెరిటేజ్ పాలలో కల్తీ ఉందని నిషేధించారు. హెరిటేజ్ పాలలో విచ్చలవిడిగా కల్తీ జరుగుతోంది. టీడీపీ సభ్యులు కల్తీని సమర్థించే విధంగా మాట్లాడటం తగదు.హెరిటేజ్ కల్తీ పాలపై నిషేధం విధించాలి. శాసనసభలో టీడీపీ సభ్యులు హెరిటేజ్ సంస్థ ప్రతినిధులవలే వ్యవహరిస్తున్నారు. కల్తీని విస్మరించి హెరిటేజ్‌ను సమర్ధించే విధంగా మాట్లాడడం తగదు. కల్తీ పాల ఉత్పత్తుల సంస్థలను నిషేధించాల్సిందే. చంద్రబాబు కుట్రతోనే కల్తీ పాలపై చర్చ జరుగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు.



బాబు బండారం బయటపడుతుందన్న భయం. శాసనసభను అగౌరవపర్చేవిధంగా టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సభను అగౌరవ పర్చడమంటే తెలంగాణ ప్రజలను అవమానపర్చినట్లే. హెరిటేజ్ పాల గుట్టు రట్టు కాకుండా టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. గుమ్మడి కాయ దొంగంటే భుజాలు తడుముకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు కల్తీ లేని పాలు అందించాలన్న లక్ష్యంతోనే నివారణ చర్యలకు ఉప్రకమించబోతుంటే అడ్డగింపులా? కల్తీ ఉత్పత్తులపై చర్యలు తీసుకోవలసిందే.    

- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

వి. శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్, రసమయి బాలకిషన్, ఏ రమేష్, ప్రభాకర్




రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే...

నిజామాబాద్ ఎంపీ  కవితపై ఆధారాలు లేని అభియోగాలు మోపిన రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి. సభను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించారు. సభకు తప్పుడు సమాచారాన్ని అందించిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.    

- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, గొంగడి సునీత



ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు

శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. స్పీకర్ సభ్యులందరికీ అవకాశం కల్పించాలి. సభలో పక్కరాష్ట్ర సీఎం ప్రస్తావన తేవడమేంటీ..? బడ్జెట్‌లోని లోపాలపై మాట్లాడితే సమాధానం చెప్పే ధైర్యం లేక అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై ఎదురుదాడి. కేటీఆర్‌కు సభా మర్యాదలు తెలియవు.     

- టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య  



ప్రతిపక్షాలపై ఎదురు దాడినా..?

బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటే ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగి కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలే తప్ప ఎదురుదాడితో తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు.  అధికార పక్షం రాజకీయంగా దిగజారి సభా మర్యాదలకు భంగం వాటిల్లేవిధంగా వ్యవహరిస్తోంది. ఇది మంచి సంస్కృతి కాదు.    

- టీడీపీ ఎమ్మెల్యే బి.వివేకానంద

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top