తమ్ముళ్ల కినుక

తమ్ముళ్ల కినుక - Sakshi


మహా అసంతృప్తి!

టీడీపీ మినీ మహానాడులో బట్టబయలైన విభేదాలు

శశికళ ఎంపికపై నేతల ఆగ్రహం

ముఖ్యనేతల డుమ్మా, పార్టీ తీరుపై కార్యకర్తల అసహనం

టీఆర్‌ఎస్‌పై ఆరోపణలకే పరిమితమైన నేతలు

ఖాళీ కుర్చీల ఎదుట నేతల ఉపన్యాసాలు

పార్టీ పటిష్టతపై చర్చ శూన్యం..

మొక్కుబడిగా తీర్మానాల ఆమోదం




సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీలో అగ్గిపుట్టింది. అధినేత ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ్ముళ్లు తిరుగుబాటు జెండా ఎగిరేశారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా శశికళాయాదవరెడ్డి పేరును ఖరారు చేయడాన్ని నిరసిస్తూ సీనియర్ నాయకులు మినీ మహానాడుకు డుమ్మా కొట్టారు. కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే వాటిని తాము గౌరవించాల్సిన అవసరం లేదని సదరు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి ఎంపికకు ముందే టీడీపీ అధినాయకత్వం కార్యకర్తల అభిప్రాయసేకరణ చేసింది.  నల్లగొండ జిల్లాకు చెందిన  టీడీపీ నేతలు కాశీనాథ్, రజినీల కమిటీ  జిల్లాలో కార్యకర్తల ఇలా వచ్చి.. అలా వెళ్లారు..

 

సంగారెడ్డిలో సోమవారం నిర్వహించిన మినీ మహానాడులో పాల్గొనకుండా నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుసగా  నర్సాపూర్, జహీరాబాద్, సిద్దిపేట  ఇన్‌చార్జీలు రఘువీరారెడ్డి,నరోత్తమ్, గుండు బూపేష్‌లు మినిమహానాడుకు గైర్హాజరయ్యారు. జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైక పటాన్‌చెరు జెడ్పీటీసి శ్రీకాంత్‌గౌడ్ సైతం హాజరుకాలేదు. దుబ్బాక, పటాన్‌చెరు, మెదక్ ఇన్‌చార్జ్‌లు బక్కివెంకటయ్య, సపాన్‌దేవ్, బట్టిజగపతి ఇలా వచ్చి రిజిష్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలతో తాము వెళ్లామని వారు చెబుతున్నప్పటికీ శశికళా యాదవరెడ్డికి జిల్లా అధ్యక్షురాలి పదవి కట్టబెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ వారు సమావేశంలో పూర్తిస్థాయిలో ఉండలేదని తెలుస్తోంది. శశికళాయాదవరెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన నాయకురాలు.



దీంతో ఆమెకు జిల్లాలోని రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. సీఎం జిల్లా కావటం, ప్రభుత్వంతో ఘర్షణాత్మక పరిస్థితులు ఉన్న ప్రస్తుత తరుణంలో మహిళా నాయకత్వం పార్టీకి నష్టం తెస్తుందని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ నేతలందరినీ ఏకతాటికి మీదికి తెచ్చే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఆమెకు లేవని టీడీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. తన సొంత పటాన్‌చెరు నియోజకవర్గంలోనే గ్రూపు రాజకీయాలు నడుపుతోందని అలాంటి ఆమె సీనియర్లు ఇతర నేతలను ఎలా కలుపుకుని ముందుకు వెళ్లారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు శశికళాయాదవరెడ్డికి గజ్వేల్ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి మినహా ఎవ్వరూ మద్దతు ఇవ్వటంలేదు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో శశికళకు అంత సులువు కాదు.

 

గులాబీ గూటికి...!

జిల్లాకు చెందిన ఒక దళిత నాయకుడు త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జోగిపేట నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన  మాజీ జెడ్పీటీసీ  గులాబి కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆయన బాటలోనే మరికొంత మంది టీడీపీ నేతలు కూడా నడవనున్నట్లు సమాచారం.  

 

పూర్వవైభవం తీసుకువద్దాం

జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ కార్యకర్తలను కోరారు. మినీమహానాడులో ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రభుత్వ పాలన గాడి తప్పిందని ఆరోపించారు.



మేనిఫెస్టోలో ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికి ఒక్కరినీ పరామర్శించలేదన్నారు.  మినీ మహానాడులో టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు శ్రీశైలం, రాష్ట్రనేతలు ఎ.కె.గంగాధర్‌రావు, విజయపాల్‌రెడ్డి, జిల్లా నేతలు ఆర్.శ్రీనివాస్‌గౌడ్, పి.మాణిక్యం, బక్కి వెంకటయ్య, మాణిక్‌ప్రభు, మేరాజ్, బీరయ్యయాదవ్ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top