మహిళల కోసం తరుణి స్టేషన్

మహిళల కోసం తరుణి స్టేషన్ - Sakshi


దూలపల్లి: నగర మెట్రో ప్రాజెక్టుల  మహిళలకు కోసం ప్రత్యేకంగా ‘తరుణి’ పేరుతో మెట్రో స్టేషన్ ఏర్పాటు చేస్తామని  హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మధురానగర్‌లో ఏర్పాటుచేసే ఈ స్టేషన్‌లో పూర్తి గా మహిళా ఉద్యోగులే ఉండే లా చర్యలు తీసుకుంటామన్నా రు. మహిళలకు సంబంధించి ఫ్యాషన్, గృహోపకరణాలు, దుస్తులు వంటి అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉం చుతామన్నారు.



విద్యార్థులు, పిల్లలకు మియాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్ల ప్రాంగణాల్లో చిన్నారులు ఆడుకునేందుకు గేమ్‌జోన్ సౌకర్యాలతోపాటు, విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ,పుస్తకాలు వంటివి అందుబాటులో ఉండేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. మైసమ్మగూడాలో ని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  



నాగోల్-మెట్టుగూడా రూట్లో మెట్రో తొలిదశను  2015 మార్చి 21న ప్రారంభించనున్నట్టు చెప్పారు. 2017 నాటికి మూడు కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మార్గం పూర్తయిన తరవాతనగరంలో మరో 200 కి.మీ వరకు మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు వెల్లడించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top