నరేశ్‌ హత్యపై సీఎం కేసీఆర్‌ స్పందించాలి: తమ్మినేని

నరేశ్‌ హత్యపై సీఎం కేసీఆర్‌ స్పందించాలి: తమ్మినేని - Sakshi

పోలీసులు నేరస్తులకు సహకరిస్తున్నారు: విమలక్క

 

సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో కుల దురంహకార హత్యలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. అంబోజు నరేశ్, స్వాతి çపరువు హత్యలకు నిరసనగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ నరేశ్‌ హత్య కేసుపై సీఎం కేసీఆర్‌ ఇంకా స్పందించక పోవడం బాధాకరమన్నారు. దీనిపై త్వరలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆయన్ను కలుస్తామని చెప్పారు. అయినా సీఎం స్పందిం చకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని హెచ్చరిం చారు.



నరేశ్‌ హత్యకేసు విషయంలో పోలీసులపై కేసులు నమోదు చేయాలని  టఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క డిమాండ్‌ చేశారు. సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాస్‌రాం నాయక్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, నరేశ్‌ తల్లిదండ్రులు వెంకటయ్య, ఇందిరమ్మ, ప్రజా సంఘాల వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top