పాలు పితకడమూ ఓ కళే..

పాలు పితకడమూ ఓ కళే..


ఆవులు.. బర్రెల పాలు పితకడమంటే చాలామంది తేలికగా తీసుకుంటారు. అయితే ఇందులోనూ రకాలుంటాయని, ఒక్కో రకంలో ఆవులు, బర్రెలు ఒక్కో రకంగా పాలు ఇస్తాయంటున్నారు.



నక్లింగ్ : బొటనవేలును మడతపెట్టి పాలు తీయడాన్ని నక్లింగ్ పద్ధతి అంటారు. ఇలా పాలు పితికితే ఆవులు, బర్రెల చన్నులు ఒత్తిడికి లోనై వాచిపోతాయి. చన్నుల్లోని కణజాలం కూడా దెబ్బతింటుంది. ఇలా పితికేవారు ఎంతత్వరగా మానుకుంటే అంత మంచిది.

 

స్ట్రిప్పింగ్ పద్దతి : బొటనవేలు, ఇతర చేతివేళ్ల మధ్య చన్నులను పట్టుకుని పైనుంచి కిందివరకు నొక్కుతూ పాలను నెమ్మదిగా, సున్నితంగా పితకడాన్ని స్ట్రిప్పింగ్ పద్ధతి అంటారు. ఇలా పితకడం ద్వారా చన్నులు కిందకుజారే ప్రమాదముంది.

 

ఫిస్టింగ్ పద్దతి : చన్నులను చేతుల్లోకి తీసుకుని వేళ్లతో మృదువుగా నొక్కుతూ పాలు పితకడాన్ని ఫిస్టింగ్ పద్ధతి అంటారు. ఈవిధానంతో పశువులకు ఎలాంటి నొప్పీ కలగదు. అన్ని రకాల్లోకంటే ఈ పద్ధతిలో పాలు పితకడమే ఉత్తమం. రైతులూ మరెందుకు ఆలస్యం.. ఫిస్టింగ్ పద్ధతిలో పాలు తీయండి..

 - నిజామాబాద్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top