పకడ్బందీగా విచారణ చేపట్టండి : జేసీ


వారిది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం.. కొన్నేళ్లక్రితం భార్యాభర్తలు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ ఏడాదే స్వగ్రామానికి వచ్చారు. అంతలోనే నెల వ్యవధిలో వారిద్దరూ చనిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు.. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు..

 


 ఉప్పునుంతల : సుమారు నాలుగేళ్లక్రితం మండల కేంద్రానికి చెందిన బొల్లె నర్సయ్య (40), చిట్టెమ్మ (35) దంపతులు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఎనిమిది నెలలక్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కుమారులు ఆంజనేయులు, అ రుణ్ వంకేశ్వరం వసతి గృహంలో ఉంటూ తొమ్మిది, ఏడో తరగతి చదువుతున్నారు. గత ఏడాది కూతురు అనూష స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివింది. ఈ క్రమంలోనే గత నెల 20న కడుపునొప్పి బాధతో తండ్రి చనిపోయా డు.



అప్పటి నుంచి తల్లి సరిగా తినక అనారోగ్యానికి గురైంది. చివరకు గురవారం అర్ధరాత్రి నిద్రలోనే మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు. శుక్రవా రం ఉదయం బాధి త కుటుంబాన్ని ఎం పీపీ తిప్పర్తి అరుణ, తహశీల్దార్ సైదులు పరామర్శించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ కట్టా సరిత తరఫున అ తని భర్త అనంతరెడ్డి *రెండు వేల చొప్పు న ఆర్థికసాయం అందజేశారు. వారికి త్వర లో క్వింటాలు బియ్యం ఇప్పిస్తానని, ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. కార్యక్రమం లో స్థానిక నాయకులు తిప్పర్తి నర్సింహా రెడ్డి, చింతగాళ్ల వెంకటయ్య, వీఆర్వో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top