వృద్ధులకు బాసటగా నిలుద్దాం

వృద్ధులకు బాసటగా నిలుద్దాం


మహబూబ్‌నగర్ విద్యావిభాగం :

 సీనియర్ సిటిజన్స్‌కు ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అన్నారు. ‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవా న్ని’ పురస్కరించుకొని వికలాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో చాలా మార్పులు వచ్చాయని, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయని అన్నారు. పిల్లలు తల్లిదండ్రులను విడిచి ఇతర ప్రాంతాలలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వాటిని గుర్తించి పెద్దవారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా దైర్యంగా ఉండాలన్నారు. మొదటి నుంచి ఆర్థిక స్థోమతను పెంచుకోవాలని, తనకం టూ కొంత కూడగట్టుకోవాలన్నారు. అందరితో ఆప్యాయంగా ఉండాలని సూచించారు. చిన్నారులకు, యువతకు నైతిక విలువలు పెంపొందించే విధంగా కృషి చేయాలని సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలన్నారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ రా జారా మాట్లాడుతూ వృద్ధులను జాతీ య సంపదగా భావించాలని, వారి అ నుభవాన్ని సమాజ అభివృద్ధికి విని యోగించుకోవాలన్నారు. పెద్దల పట్ల ప్రేమాభిమానాలు చూపాలన్నారు. సంబంధబాంధవ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. సీనియర్ సివిల్ జడ్జి శేషగిరిరావు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2007లో తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం వచ్చిందని, అయితే, ఆ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయడం లేదన్నారు. రెడ్‌క్రాస్ చైర్మన్ మద్ది అనంతరెడ్డి, సీనియర్ అడ్వకేట్ మనోహర్‌రెడ్డిలు మాట్లాడుతూ తల్లిదండ్రులను చూసుకోని కొడుకులను కనేకంటే ఒక కుక్కను పెంచుకోవడం మేలని ఒక కవి అన్నారని, ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. మనం ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని సూచించారు. భారతదేశ సం స్కృతి సంప్రదాయాలను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో వీఐపీ సంస్థ అధ్యక్షుడు నాగేంద్రస్వామి, సత్తూరు రాములుగౌడ్, వికలాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ ఏడీ మూర్తి, పాండురంగం, లక్ష్మీసోమశేఖర్ పాల్గొన్నారు. అనంతరం వృద్ధులను జిల్లా కలెక్టర్ సన్మానించారు.







 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top