‘నీలగిరి’ నిప్పుల కొలిమి


 చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన అన్నపు నర్సింహ్మ(62) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల కిత్రం  వడదెబ్బకు  గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లోనే  చికిత్స పొందుతున్న న ర్సింహ శుక్రవారం మృతిచెందాడు. అదే విధంగా ఆరేగూడెం గ్రామానికి చెందిన దంబాల.మల్లయ్య(65) వడదెబ్బకు గురై గురువారం సాయంత్రం మృతిచెందాడు.   

 

 పిట్టంపల్లిలో..

 మండలంలోని పిట్టంపల్లికి చెందిన మేడి చంద్రయ్య(21) గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురై  శుక్రవారం మృతిచెందాడు.

 

 కేతేపల్లిలో ఇద్దరు వృద్ధులు..

 కేతేపల్లి: కేతేపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన రాచకొండ లక్ష్మమ్మ(60), కొ ప్పోలు గ్రామానికి చెందిన ఉప్పుల లింగమ్మ(70) రెండు రోజులుగా వీస్తున్న వడగాల్పులతో  స్వస్థతకు గురయ్యారు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు.

 

 గౌస్‌నగర్‌లో..

 భువనగిరి అర్బన్:  భువనగిరి మండలం గౌస్‌నగర్ గ్రామానికి చెందిన పల్లేర్ల చంద్రయ్య(82) వడగాల్పులకు నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించినా శుక్రవారం మృతి చెందాడు.

 

 ఆత్మకూర్ (ఎస్) మండలంలో ముగ్గురు..

 ఆత్మకూర్(ఎస్): ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్ గ్రామానికి చెందిన మచ్చ పిచ్చయ్య(50) ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నా డు.  గురువారం కూలికి వెళ్లి  అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించినప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఇదే గ్రామానికి చెందిన కందాళ వెంకట్‌రెడ్డి (60) ఇంటి వద్దనే ఉంటున్నాడు. వేడి గాలులకు తట్టుకోలేక శుక్రవారం మృతిచెందాడు. అదే విధంగా మండల కేంద్రానికి చెందిన జంపాల వెంకటయ్య(80) ఇటీవల మోతె మండలంలోని సిరికొండ గ్రా మంలో నివాసముంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. ఎండవేడిమికి తట్టుకోలేక శుక్రవారం అక్కడే మృత్యువాత పడ్డాడు.

 

 రాజాపేట: రాజాపేట మండల కేంద్రానికి చెందిన దేశపాండే దుర్గయ్య (60)గురువారం 11 గంటల సమయంలో సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లాడు. ఎండ వేడిమి, వేడిగాలులకు తట్టుకోలేక అక్కడే పడిపోయాడు. సా యంత్రం స్థానికులు గమనించి దుర్గయ్యను అతడి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే తీవ్ర ఆస్వస్థతకు గురైన దుర్గయ్య వాంతులు, విరేచనాలతో బాధపడుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మృతిచెందాడు.

 మునగాల: మండల కేంద్రానికి చెందిన ఎలక అంజిరెడ్డి(47) మూడు రోజులుగా వీస్తున్న వడగాలులు, ఎండదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్ద చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

 

 దామరచర్ల మండల పరిధిలో..

 దామరచర్ల: మండలం పరిధిలోని వీర్లపాలెం గ్రామానికి చెందిన కంబంపాటి కిష్టయ్య(50) వృత్తి రీత్యా బట్టలు ఉతికేందుకు చాకి రేవుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే విధంగా  మండల కేంద్రానికి చెందిన సిద్ధారపు సోమమ్మ(65) వడదెబ్బకు గురై శుక్రవా రం మృతిచెందింది. ఈమెకు కుమారుడు ఉన్నా డు  కొండ్రపోల్ గ్రామ పంచాయతీ పరిధి గేర్ తండాకు చెందిన అడావత్ జానకీ(65) కూడా ఎండవేడిమికి తట్టుకోలేక మృతి చెందిందని తండావాసులు పేర్కొన్నారు.

 

 చిలుకూరు: మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన మంగమ్మ(55) శుక్రవారం తీవ్ర వడదెబ్బకు గురైంది. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది.  

 

 ఆత్మకూరు(ఎం) మండలంలో ఇద్దరు..

 ఆత్మకూరు(ఎం): మండల కేంద్రానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు మజ్జిగ నర్సయ్య(85) గురువారం తన కూతురు ఇంటికి రాయిపల్లి గ్రామానికి వెళ్లాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

 

 కూరెళ్లలో....

 మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన మారుపాక రామయ్య(75) వడదెబ్బతో శుక్రవారం ఉదయం మృతిచెందాడు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కొద్ది సేపు పడుకున్నాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో మం చం మీదనే మృతిచెందాడు.

 

 రాయిపల్లిలో..

 మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన  ఏలె మణెమ్మ(65) ఎండవేడిమికి గురువారం తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

 

 హుజూర్‌నగర్‌లో ఇద్దరు..

 హుజూర్‌నగర్: పట్టణ పరిధిలోని మాధవరాయినిగూడెం గ్రామానికి చెందిన సంపంగి ము త్తమ్మ (63) ఇంటి వద్దనే ఉంటోంది.  నాలుగు రోజులుగా ఎండ తీవ్రత పెరిగి వడ గాల్పులు ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురైంది. స్థానికంగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదే విధంగా పట్టణానికి చెందిన ఇట్టె శ్రీనివాస్ (38) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. వడదెబ్బకు గురై మృతిచెందాడు.  

 మోత్కూరు: మోత్కూరు మండలం చిన్నపడిశాల గ్రామానికి చెందిన బట్టమేకల ధనమ్మ(35) కూలీగా జీవనం సాగిస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రతలకు తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందింది. మృతురాలికి భర్త, నలుగురు పెళ్లికావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు.

 

 మఠంపల్లి : మండల కేంద్రంలో నివాసముం టున్న  గోపాలదాసు శంభయ్య (62) గ్రామ పంచాయతీ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణపొందారు. ఇటీవల వీస్తున్న వడ గాలులకు శంభయ్య తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం తన స్వగృహంలో మృతిచెందాడు.

 

 వేములపల్లి మండలంలో నలుగురు

 వేములపల్లి: మండలంలోని ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అవిరెళ్ల ఎల్లమ్మ (38) గురువారం వడదెబ్బకు గురైం ది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలికి భర్త, పాప, బాబు ఉన్నారు. అదేవిధంగా రావులపెంటలో గంగా లక్ష్మమ్మ (70), సల్లా కిష్టయ్య (70) కూడా వడదెబ్బకు గురై గురువారం రాత్రి మరణించినట్లు తెలిపారు.

 

 కుక్కడంలో..

 వేములపల్లి : మండలంలోని కుక్కడం గ్రామానికి చెందిన నల్లగంతుల నర్సయ్య (66) ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజులుగా వీస్తున్న వడగాల్పులకు అస్వస్థతకు గురై శుక్రవారం మృతిచెందాడు.

 

 మోతె: మండల పరిధిలోని నర్సింహాపురం గ్రా మానికి చెందిన చింతోజు నర్సింహాచారి(60) శుక్రవారం రంగాపురం తండాలో కులవృత్తి చేసి ఇంటికి తిరిగి వస్తూ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రి కి తరలించే లోపే మృతిచెందాడు. మృతుడికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

 జాజిరెడ్డిగూడెంలో..

 అర్వపల్లి: మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రా మానికి చెందిన బాషబోయిన వెంకన్న (30) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వరుసగా వారం రోజుల నుంచి వెళుతూ వడదెబ్బకు గురై శుక్రవారం మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

 సంస్థాన్ నారాయణపురంలో ..

 సంస్థాన్‌నారాయణపురం: మండలంలోని పల్లగట్టుతండాకు చెందిన కేలోతు కిషన్(25) ఉపాధి కూలీగా పనిచేస్తున్నాడు. వారం రోజు ల నుంచి ఉపాధి హమీ పనికి వెళ్తున్నాడు. శుక్రవారం ఉదయం పని చేసి ఇంటికి వెళ్లి తీ వ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుంటుంబ స భ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెం దా డు. అదే విధంగా మండల కేంద్రానికి చెందిన దొంశెట్టి శేఖరప్ప(62) హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం వడ దెబ్బకు గురై మృతిచెందాడు.

 

 నేరేడుచర్ల: మండలంలోని శూన్యపహాడ్ గ్రా మానికి చెందిన సఫావత్ చత్రునాయక్ (70) శుక్రవారం గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. ఎండలు తీవ్రం గా ఉండటంతో వడ దెబ్బ సోకడంతో ఇంటికి చేరుకున్న కొద్ది సేపటికి మృతిచెందాడు.  

 

 దిర్శించర్లలో...

 మండలంలోని దిర్శించర్ల గ్రామానికి చెందిన కాసాని సైదమ్మ (70) ఎండ తీవ్రత తట్టుకోలేక శుక్రవరాం మృతిచెందింది.

 

 చివ్వెంల: మండల పరిధిలోని బీబిగూడెం ఆవాసం కొండల రాయినిగూడెం గ్రామానికి చెందిన నర్రా పెంటమ్మ(60)శుక్రవారం ఎండవేడిమి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అనంతరం ఇంటకి తీసుకు రాగా సాయంత్రం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.  

 

 రామ్‌కోటితండాలో.....

 మండల పరిధిలోని దురాజ్‌పల్లి ఆవాసం రామ్‌కోటితండాకు చెందిన జాటోతు ద్వాలీ (60) రెండు రోజుల క్రితం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అస్వస్థతకు గురయింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమ్తిత్తం సూర్యాపేటకు తీసుకెళ్లారు.  పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.  

 గరిడేపల్లి: మండలంలోని గంగానగర్‌కు చెందిన నెట్టెం వెంకటయ్య (75) పొలంవద్ద చెట్లు కొట్టేందుకు వెళ్లి అస్వస్థతకు గురయ్యా డు. ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు.   

 

 రాయినిగూడెంలో...

 మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెం దిన కోళ్ల సాయమ్మ (70)  శుక్రవారం గ్రామం లో జరిగిన శుభకార్యానికి హాజరైంది. ఎండవేడిమికి తట్టుకోలేక మృతిచెందింది.

 

 పెద్దవూర: మండలంలోని చలకుర్తి గ్రామ పంచాయతీ పరిధి బెట్టెలతండాకు చెందిన బాణావత్ మన్నీనాయక్(52) రోజులాగే తన వ్యవసాయ పొలంలో పనులకు వెళ్లాడు. శుక్రవారం వడదెబ్బకు గురయ్యాడు.  గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు.

 

 కోదాడలో మున్సిపల్ కార్మికురాలు

 కోదాడటౌన్: కోదాడకు చెందిన కాంపాటి మంగమ్మ(42) స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం వడదెబ్బకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది.

 తిరుమలగిరి : తిరుమలగిరి మండల కేంద్రాని కి చెందిన పోతరాజు వెంకయ్య(65) మా లిపురం గ్రామ పంచాయతీలో వాటర్‌మన్‌గా పనిచేస్తున్నాడు.రోజు మాదిరిగానే విధులు నిర్వహిస్తూ ఎండ వేడి తాళలేక శుక్రవారం అక్కడికక్కడే మృతి చెందాడు.

 

 కొండమల్లేపల్లి: దేవరకొండ మండలం దోని యాల గ్రామ పంచాయతీకి చెందిన గుండాల మల్లమ్మ (71) ఎండ వేడికి తాళలేక అస్వస్థత కు లోనై శుక్రవారం మృతిచెందిందని కుటు ంబ సభ్యులు తెలిపారు.  

 కందిబండ(మేళ్లచెర్వు): మండలంలోని కంది బండ గ్రామానికి చెందిన పోలె పెదనర్సయ్య(53),ముళ్లగిరి వెంకటనర్సు(56) వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. రోజు మా దిరిగానే కూలికి వెళ్లి ఎండవేడిమికి తాళలేక అస్వస్థతకు గురై మృతిచెందారు.

 

 పెన్‌పహాడ్: మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన  మల్గిరెడ్డి వీరారెడ్డి (68) పెరిగిన ఎండవేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతిచెందాడు.

 

 మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణం చైతన్యనగర్‌కు చెందిన జువ్వాది ముత్తమ్మ(50) కూలీగా జీవనం సాగిస్తోంది. గురువా రం కూడా కూలికి వెళ్లి అస్వస్థతకు గురైంది. దీంతో పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు  బంధువులు తెలిపారు.

 

 హాలియా మండల పరిధిలో ఇద్దరు.. హాలియా: మండలంలోని  గరికేనాటితండాకు చెందిన సఫావత్ శ్రీనివాస్(35) ఉపాధి హామీ మేటుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం కూలీలతో కలసి పనికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  పని ప్రదేశంలోనే కుప్పకులి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

 

 పంగవానికుంటలో..

 మండలంలోని పంగవానికుంట గ్రామానికి చెందిన కత్తి కృష్ణవేణి(55) పని నిమిత్తం శుక్రవారం గ్రామంలో తిరిగింది. ఎండవేడిమికి తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతిరాలికి కుమార్తే, ముగ్గురు కుమారులున్నారు.

 

 కట్టంగూర్ : మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన చెరుకు సరితసైదులు దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కూమారుడు చెరకు మధు(5) రెండు రోజుల క్రితం ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. గ్రామంలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ మృతి చెందాడు.

 

 శాలిగౌరారం: మండలంలోని మాధారంకలాన్ గ్రామానికి చెందిన వృద్ధుడు మనిమద్దె పిచ్చయ్య(80) శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. మృతునికి వివాహితులైన ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.  

 దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఎన్‌టిఆర్ కాలనీకి చెందిన వావిళ్ళపల్లి ఎల్లయ్య (65) గత రెండు మూడు రోజులుగా ఎండవేడికి తాళలేక గురువారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.  

 

 పలివెలలో మేకల కాపరి

 పలివెల(మునుగోడు): మండలంలోని పలివెల గ్రామానికి చెందిన కొండూరి భిక్షం(50) వృత్తిరీత్యా మేకల కాపరి. రోజువారిగా గురువారం తన మేకలను మేపేందుకు వ్యవసాయ భూములల్లోకి తోలుకునిపోయాడు. మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడే ఉండటంతో ఎండవేడికి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారై కలరు.

 

 కనగల్: మండలంలోని రేగట్టెకు చెందిన వ్యక్తి కారింగ్ అంజయ్య(56) తన వ్యవసాయబావి వద్ద ఎండలో పనిచేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యలు చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు.  

 

 కోదాడటౌన్: మండల పరిధిలోని తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్(28) వడదెబ్బకు గురై  మృతిచెందాడు. ఇంకా మునుగోడు, మర్రిగూడ మండలాల పరిధిలో  ఇద్దరు చొప్పున మృతిచెందారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top