చావుదెబ్బ

చావుదెబ్బ


 భానుడు చండ ప్రచండుడిగా మారాడు. సూరీడు నిప్పుల సెగలు కక్కుతున్నాడు. జిల్లాలో ఒక్క ఆదివారం నాడే 44 మంది ఎండదెబ్బకు ప్రాణాలొదిలారు. ఉదయం 8 గంటలు దాటిందంటే బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. వడగాడ్పుల ప్రభావం సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు.

 

 డబ్బాలో వృద్ధురాలు

 ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో అబ్బుని సత్తమ్మ(78) అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతిచెందింది. వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగానే వాంతులు చేసుకుని కుప్పకూలింది.  

 మీర్జంపేటలో వృద్ధుడు

 మీర్జంపేట(క్వాశ్రీరాంపూర్) : మండలంలోని మీర్జంపేటకు చెందిన పెనుగొండ రాజయ్య(60) గోదావరిఖనిలో ఉంటున్న కూతురి వద్దకు శనివారం వెళ్లాడు. వడదెబ్బకు గురై రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతుళ్లు ఉన్నారు.



 జీలకుంటలో మహిళ

 ఓదెల : మండలంలోని జీలకుంటకు చెందిన అ గ్గి శోభ ఉరఫ్ మల్లేశ్వరి వడగాడ్పులకు అస్వస్థతకు గురై  మృతిచెందింది.  

 శంకరపట్నంలో ఇద్దరు

 శంకరపట్నం : మండలంలో వడదెబ్బతో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. కేశవపట్నంకు చెందిన అల్లెంకి వీరమ్మ(80), వంకాయగూడెంకు చెందిన నాంపెల్లి కనుకమ్మ(65) వడదెబ్బతో మృతిచెందారు.

 కమలాపూర్‌లో నలుగురు

 కమలాపూర్ : మండలంలోని కమలాపూర్, గూడూరు, శ్రీరాములపల్లికి చెందిన నలుగురు వడదెబ్బతో మృతిచెందారు. కమలాపూర్‌కు చెందిన బైక్ మెనానిక్ కొండి సదానందం(65), మౌటం వనమ్మ(50), గూడూరుకు చెందిన తెప్ప కొమురయ్య(60) వడదెబ్బతో ప్రాణాలొదిలారు. శ్రీరాములపల్లికి చెందిన ఇమామ్ పటాన్(60) బండరారుు కొట్టేందుకు వెళ్లి ఎండదెబ్బకు గురయ్యూరు. అర్ధరాత్రి పరిస్థితి విషమించి ప్రాణాలొదిలారు.



 వేములవాడలో వృద్ధురాలు

 వేములవాడ అర్బన్ : వేములవాడలోని న్యూఅర్బన్ కాలనీకి చెందిన గొడిశెల బాలవ్వ(70) కూలీ పనులకు వెళ్తుంటుంది. అరుుతే ఎండలు తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురై మృతిచెందింది.  

 కరీంనగర్‌లో వృద్ధుడు

 కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని సరస్వతినగర్‌లో కర్ర చంద్రారెడ్డి(80) వడదెబ్బకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  



 కరీంనగర్‌లో యువకుడు

 కరీంనగర్ : వడదెబ్బతో కరీంనగర్‌లోని 25వ డివిజన్‌కు చెందిన మారుతూరి కిరణ్(30) హార్వెస్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వృత్తి నిమిత్తం ఖమ్మం జిల్లా యశ్వంత్‌రావుపేట మండలం అమ్మగారిపల్లికి వెళ్లాడు. అరుుతే కిరణ్ వడదెబ్బకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందినట్లు డివిజన్ కార్పోరేటర్ కట్ల విద్యసతీశ్ తెలిపారు.

 మల్కపేటలో వివాహిత

 మల్కపేట(కోనరావుపేట) : మండలంలోని మల్కపేటకు చెందిన మొగిలి దివ్య(28) రెండు రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్తుంది. వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది.  



 జాదారావుపేటలో ఉపాధిహామీ కూలీ

 కాటారం: మండలంలోని జాదారావుపేటకు చెందిన జాకె రాజయ్య(36) నాలుగు రోజుల క్రితం ఉపాధిహామీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.  

 ఇబ్రహీంపల్లిలో వృద్ధురాలు

 కాటారం : మండలంలోని చింతకాని పంచాయతీ పరిధిలోని ఇబ్రహీంపల్లికి చెందిన చేరాల సమ్మక్క(65) బహిర్భూమికి వెళ్లి వడదెబ్బకు అస్వస్థతకు గురైంది. ఇంటికొచ్చిన కొద్ది సేపటికే మృతిచెందింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్పంచ్ ఆర్థిక సాయం చేశారు.  



 బెజ్జంకిలో ఇద్దరు..

 బెజ్జంకి : మండలంలోని జంగపల్లిలో వడదెబ్బతో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. గుంటుక తులుశవ్వ(75) శనివారం రాత్రి, పంతంగి రాజవ్వ(80) ఆదివారం ప్రాణాలొదిలారు.

 సుల్తానాబాద్‌లో ఇద్దరు

 సుల్తానాబాద్: మండల కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన బాదం జయప్రద (70) టీవీ వీక్షిస్తూ హఠాత్తుగా కుప్పకూలింది. వడగాల్పులు అధికంగా రావడంతోనే అస్వస్థతకు గురై మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గొల్లపల్లికి చెందిన బొంకూరి వెంకటయ్య (65) అనే మేకల కాపరి.. అడవి మేకలను తీసుకెళ్లి మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. మంచంలో పడుకుని అలాగే ప్రాణాలొదిలారు.  



 వల్లంపెల్లిలో వృద్ధురాలు

 వల్లంపెల్లి(మేడిపెల్లి) : మండలంలోని వల్లంపెల్లికి చెందిన సంపతి లింగవ్వ(70) వృద్ధురాలు కూలీ పనులకు వెళ్తుంది. వడదెబ్బకు గురై శనివారం మృతిచెందింది.  

 మానకొండూర్‌లో ముగ్గురు

 మానకొండూర్: మండలంలో ముగ్గురు మృతి చెందారు. మండలంలోని ఈదులగట్టెపల్లికి చెందిన చెలికాని మల్లమ్మ(70) పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వచ్చి అస్వస్థతకు గురై శనివారం రాత్రి మృతిచెందింది. శ్రీనివాస్‌నగర్ గ్రామానికి చెందిన గట్టు లక్ష్మయ్య(55) తన గేదె కోసం గాలించి వడదెబ్బకు గురయ్యూడు. రాత్రరుునా ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లాడని కుటుంబసభ్యులు భావించగా.. గ్రామంలోని తూర్పు దర్వాజకు సమీపంలో మృతి చెందాడు. వెల్ది గ్రామానికి చెందిన గడమల్ల యాదయ్య(68) అనే వృద్ధుడు అస్వస్థతకు గురై కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు.  



 చీలాపూర్‌లో వృద్ధుడు

 బెజ్జంకి : మండలంలో చీలాపూర్‌కు చెందిన పరుకాల నర్సయ్య(90) వడదెబ్బకు గురై ఇంటి వద్ద మృతి చెందాడు. ఎండతీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 బొమ్మకల్‌లో వృద్ధుడు

 సైదాపూర్‌రూరల్ : మండలంలోని బొమ్మకల్‌కు చెందిన కొంకట ఓదయ్య(75) వడగాడ్పులకు అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించి ఆదివారం ప్రాణాలొదిలాడు.  



 చొప్పదండిలో ఇద్దరు

 చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్‌కు చెం దిన గాండ్ల సత్యనారాయణ(42) అనే రైస్‌మిల్ కార్మికుడు పనిచేస్తూ అస్వస్థతకు గురయ్యూడు. ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలొదిలాడు. దేశాయిపేటకు చెందిన కాషపాక సంపూర్ణ(19)  వడదెబ్బతో మృతి చెందింది.  

 వెంకటాయపల్లిలో గీతకార్మికుడు

 గంగాధర :  మండలంలోని వెంకటాయపల్లికి చెందిన రావుల మల్లగౌడ్ అనే గీత కార్మికుడు ముంజలు విక్రరుుంచేందుకు ప్రధాన రహదారిపై మూడు రోజులుగా కూర్చోవడంతో అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించి ప్రాణాలొదిలాడు.  



 తంగళ్లపల్లిలో యువతి

 సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం తంగళ్లపల్లికి చెందిన వడ్నాల మానస(22) పనిపై బయటకు వెళ్లి అస్వస్థతకు గురైంది. ఇంటికొచ్చిన మానస ఒక్కసారిగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించేలోగానే మృతిచెందింది.   

 లస్మక్కపల్లిలో వృద్ధురాలు

 వీణవంక : మండలంలోని లస్మక్కపల్లికి చెందిన మర్రి వీరమ్మ(60) వ్యవసాయ పనులకు వెళ్లింది. ఇంటికి రాగానే అస్వస్థతకు గురై మృతిచెందింది.  



 హుస్నాబాద్‌లో ముగ్గురు

 హుస్నాబాద్‌రూరల్ : హుస్నాబాద్‌కు చెందిన బొడ్డు వెంకటాద్రి(58), కేశ్వాపూర్‌కు చెంది ఐద నాంపెల్లి(65) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యూరు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ప్రాణాలొదిలారు. అక్కన్నపేటకు పంచాయతీ పరిధిలోని పంతుల్‌నాయక్ తండాకు చెందిన బానోతు ముంజ్యా(65)కు చెందిన గడ్డి వాము ప్రమాదవశాత్తు నిప్పంటుకోగా చల్లార్పే ప్రయత్నంలో వడదెబ్బకు  గురై ప్రాణాలొదిలాడు.  

 జగిత్యాలలో వికలాంగురాలు

 జగిత్యాల అర్బన్ : పట్టణంలోని సాయిరాంనగర్‌కు చెందిన వెంకటేశ్, సత్యవతి దంపతుల కుమార్తె సాయిని అనూష(15) ఆదివారం వడదెబ్బతో మృతి చెందింది.  

 గుల్లపేటలో వృద్ధురాలు

 జగిత్యాల జోన్ : జగిత్యాల మండలం గుల్లపేటకు చెందిన మెడపట్ల పోషవ్వ(86) ఆదివారం వడదెబ్బతో మృతిచెందింది.  



 జమ్మికుంటలో ఇద్దరు

 చనపల్లి(జమ్మికుంట రూరల్): మండలంలోని మాచనపల్లికి చెందిన వేల్పుల రాజమ్మ(70), వావిలాలకు చెందిన గుమ్మడవెల్లి మొండయ్య(60) వడదెబ్బతో ప్రాణాలొదిలారు.  

 జగ్గరావుపల్లిలో వృద్ధుడు

 బోయినపల్లి : మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన మల్లయ్య(60) ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే కుప్పకూలాడు.  



 చీలాపూర్‌లో వృద్ధుడు

 బెజ్జంకి : మండలంలో చీలాపూర్‌కు చెందిన పరుకాల నర్సయ్య(90) తీవ్ర ఎండలకు అస్వస్థతకు గురయ్యూడు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలొదిలాడు.  

 పెద్దపల్లిలో మహిళ

 పెద్దపల్లి: పట్టణంలోని బండారుకుంట తాజ్‌మజీద్ ఏరియాకు చెందిన మీర్జా నబియూబేగం(42) శనివారం కూలీ పనులకు వెళ్లింది. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.  

 ఆవునూర్‌లో వృద్ధురాలు

 ముస్తాబాద్ : మండలంలోని ఆవునూర్‌కు చెందిన ఉమ్మనవేని రాజవ్వ(66) ఉదయం పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికొచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.  



 సింగరేణిలో ముగ్గురు..

 కోల్‌సిటీ : గోదావరిఖనిలో వడదెబ్బతో ముగ్గురు ప్రాణాలొదిలారు. విజయ్‌నగర్‌కు చెందిన పిక్కల ఓదెలు(59) పనిపై లక్ష్మీనగర్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలాడు. సింగరేణి ఏరి యా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వినోభనగర్‌కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు తొగరి రాయలింగు(65) అస్వస్థతకు గురై తెల్లవారుజామున మృతిచెందాడు. కాకతీయనగర్‌లో ఆరెకటిక వృత్తి చేసుకునే కుంబార్కర్ లచ్చన్న(55) డయాలసిస్ చేయించుకునేందుకు కరీంనగర్‌కు శనివారం వెళ్లి వచ్చాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top