నిప్పులు చెరిగిన భానుడు

నిప్పులు చెరిగిన భానుడు


వడదెబ్బకు గురై 8మంది మృతి

మృతుల్లో వృద్ధులే అధికం

 


 ఆత్మకూర్ : భానుడి ఉగ్రరూపానికి జనం విలవిలలాడిపోతున్నారు. జిల్లాలో జనం పిట్టల్లారాలిపోతున్నారు. ఈ క్రమంలో గురువారం ఒకేరోజు 8మంది వడదెబ్బకు గురై చనిపోయారు. ఈ క్రమంలో ఆత్మకూరులో ఓ కూలీ మృతిచెందాడు. పట్టణానికి  చెందిన మండ్ల సత్యన్న(46) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఎప్పటిలాగే కూలీపనులకు వెళ్లిన సత్యన్న తీవ్రఅస్వస్థతకు గురికావడంతో రాత్రి ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమిం చడంతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.



 శాయిన్‌పేట పశువుల కాపరి

 లింగాల: మండల పరిధిలోని శాయిన్‌పేటకు చెందిన పశువుల కాపరి కొనమోని ఈదన్న(60) వడదెబ్బకు గురై బుధవారం రాత్రి చని పోయాడు. పశువులను కాసేందుకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చి అస్వస్థతకు గురయ్యాడు. నిద్రలో కనుమూశాడని కుటుంబసభ్యులు తెలిపారు.



 వికలాంగుడు మృతి

 వనపర్తిరూరల్: వడదెబ్బతో ఓ వికలాంగుడు చనిపోయాడు. మండలంలోని కిష్టగిరి గ్రామానికి చెందిన తిరుపతయ్య(45) గ్రామంలో కూలీపనులు చేసుకుని జీవిస్తుండేవారు. భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఊరికెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. స్థానికులు తలుపులు తెరిచిచూడగా గురువారం ఉదయం విగతజీవిగా ఉన్నాడు. ఎండలో తిరిగి అస్వస్థతకు గురై మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.



 దాసరిపల్లిలో వృద్ధుడు

 మల్దకల్: మండలంలోని దాసరిపల్లి గ్రామానికి చెందిన గంగావతి తిమ్మన్న (62) అనే వృద్ధుడు పొలంలో పనులు చేసేందుకు గురువారం ఉదయం వెళ్లాడు. ఎండవేడికి తాళలేక మధ్యాహ్నం సృహతప్పి పడిపోయాడు. చికిత్సకోసం ఆస్పత్రికి తర లిస్తుండగా చనిపోయాడు.  



 జమ్మిచేడులో చిన్నారి

 గద్వాల న్యూటౌన్ : మండలంలోని జమ్మిచేడు గ్రామానికి చెందిన వీరన్న, సుజాత కుమార్తె భారతి(02) వడదెబ్బకు గురైంది. దీంతో తేరుకున్న తల్లిదండ్రులు సాయంత్రం చికిత్సకోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది.  

 

 జడ్చర్లలో వృద్దుడు బలి

 జడ్చర్ల: స్థానిక దామోదర సంజీవయ్య కాలనీకి చెందిన సుంకసారి జంగయ్య(65)అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మూడురోజుల క్రితం అస్వస్థతకు గురైన జంగయ్యను చికిత్సకోసం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం చనిపోయాడు.

 

 వెల్కిచర్లలో వృద్ధుడు

 భూత్పూర్: వడదెబ్బకు మండలంలోని వెల్కిచర్ల గ్రామానికి చెందిన గోసుల గాలెన్న(70) మృతిచెం దాడు. అస్వస్థతకు గురికావడంతో చికిత్సకోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పిం చారు.పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

 

 మస్తిపురంలో వ్యక్తి

 నర్వ: జములమ్మ దేవర కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై చనిపోయాడు. ఈ సంఘటన ఆత్మకూర్ మండలంలోని మస్తిపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయకుర్మన్న(30) మదనపురం గ్రామ సమీపంలోని తిరుమలాపల్లిలో ఉన్న బంధువులు జములమ్మ చేస్తున్నామని చెప్పడంతో వెళ్లాడు. రెండురోజుల పాటు దేవర ఉత్సవంలో పా ల్గొన్న కుర్మన్న అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో గురువారం చనిపోయాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top