పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం


కొత్తూరు : పోలీసుల వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ట్టు రంగాపూర్ గ్రామపంచాయతీ తాటిగడ్డతండాకు చెందిన జటావత్ ఆనంద్‌నాయక్ ఆరోపించారు. ఈ ఘటనకు సం బంధించి బాధితుడు తమకు ఫిర్యా దు చేస్తే బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ కల్మేశ్వర్ సింగేనవర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది జులై 2న ఇదే తండాకు చెందిన కిషన్‌నాయక్ (48) దారుణహత్యకు గురయ్యా డు. ఈ మేరకు అప్పట్లోనే కొత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ నెల 5వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు జటావత్ ఆనంద్‌నాయక్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ‘నేను నేరం చేయలేనని.. తండాలో ఓ నాయకుడిగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను..’ అని విన్నవించినా పోలీసులు పట్టించుకోకుండా వేధింపులకు గురిచేశారు. దీనిని అవమానంగా భావించిన ఆనంద్‌నాయక్ శుక్రవారం మధ్యాహ్నం మూత్రవిసర్జన కోసం బయటకు వె ళ్లి స్టేషన్ ఆవరణలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే తండావాసులు స్టేషన్ వద్దకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉన్నతాధికారులు అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని సర్దిచెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 లంచం అడిగారు

 కాగా హత్య కేసు నుంచి బయటపడేందుకు పోలీసులు *మూడు లక్షలు లంచం అడిగినట్లు విలేకరుల ఎదుట బాధితుడి భార్య భామినితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్‌ఐతో పాటు ఇతర సిబ్బంది  వేధింపుల కారణంగానే ఆనంద్‌నాయక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. తమకు న్యాయం జరిగకుంటే ఆందోళన చేస్తామన్నారు.

 

 ఈ విషయమై ఏఎస్పీ కల్మేశ్వర్‌సింగేనవర్‌ను వివరణ కోరగా ఆనంద్‌నాయక్ మూత్రవిసర్జన చేసే సమయంలో హైఓల్టేజీ కారణంగా అకస్మాత్తుగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వచ్చిన నిప్పు రవ్వల వల్లే గాయపడినట్లు తెలిపారు. ఒకవేళ పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చే స్తే సమగ్ర విచారణ చేపడతామన్నారు. అందుకు బాధ్యులైన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధితుడిని ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎమ్మె సత్తయ్య, నాయకుడు గోవు రవికుమార్ పరామర్శించారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top