ఖాళీల భర్తీపై అయోమయం?

ఖాళీల భర్తీపై అయోమయం?


పాలమూరు: రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ మూడున్నర నెలలుగా అభ్యర్థుల ఓపికను పరీక్షిస్తోంది. 2014-15 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు జూలైలో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు గానీ, ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఆర్వీఎం ద్వారా చేపడుతున్న కార్యక్రమాల అమలుకు కాంట్రాక్టు విధానంతో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల పేరిట పీఈటీ, చేతివృత్తులు, కళల విభాగంలో జిల్లావ్యాప్తంగా 692 పోస్టులు మంజూరయ్యాయి. ఇందుకు గతేడాది 345 మందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. ఈ విద్యా సంవత్సరానికి కూడా నియామకాలను పునరుద్ధరించేందుకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన అధికారులు ప్రక్రియను పెండింగ్‌లో పెట్టి తాత్సారం చేయడం ఇబ్బందిగా మారింది. దీనికితోడు మొత్తం పోస్టుల్లో మిగిలిపోయిన 347 ఖాళీ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి పెట్టక పోవడంతో అయోమయం నెలకొంది.   

 నోటిఫికేషన్‌తోనే గందరగోళం...

 ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ నియామకాల పునరుద్ధరణ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికతపై స్పష్టత ఇవ్వలేదు. మండలం యూని ట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొందరు, స్కూ ల్ కాంప్లెక్స్ యూనిట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొన్నిచోట్ల ఎంపిక పూర్తి చేశారు. స దరు అభ్యర్థుల వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఈ ప్రక్రియ ముగి సి నెలలు గడుస్తున్నా నియామకం గురించి     అభ్యర్థులకు సమాచారం ఇవ్వలేదు. పెరిగిన పని గంటల బాధ్యతలను ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయా మ ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే ఉపాధ్యాయులే లేనప్పుడు విధులు ఎలా పంచుకుంటారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. తమకు నియామ కం విషయంలో అధికారిక ప్రకటన చేస్తే ఈ ఎంపిక కోసం ఆగి ఉండాలో లేక మరేదైనా మా ర్గం చూసుకోవాలో నిర్ణయించుకుంటామని అభ్యర్థులు వాపోతున్నారు.

 



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top