మీడియా పాయింట్: తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలి


సాక్షి,హైదరాబాద్: అమరవీరుల త్యాగాలతో  రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాకే దక్కుతుంది. అత్మబలిదానాలను ముగింపు పలికేందుకే కాంగ్రెస్‌కు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని తెలిసీ కూడా సోనియా నిర్ణయం తీసుకున్నారు. అమరుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలి. ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించి రాయితీలు కల్పించాలి.   

-డీకే ఆరుణ, మల్లు భట్టి విక్రమార్క,

టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

 

 సాగర్ వద్ద 100 అంతస్తుల భవనాలు వద్దు

 శాసనసభలో ఆమరవీరుల కుటుంబాలకు సాయం గురించి మాట్లాడితే ప్రభుత్వం దాటివేత ధోరణి కొనసాగిస్తోంది. అమరుల కుటుంబాలకు ఎలాంటి సాయం అందిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు.  అమరుల త్యాగఫలితమే రాష్ర్టం ఏర్పాటు. ఆయినా ఆ కుటుంబాలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు.

     - ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే

 

 సిర్పూర్ పరిశ్రమను పునరుద్ధరించాలి

 సిర్పూర్ పరిశ్రమను తక్షణమే పునరుద్ధరించాలి. ఇప్పటికే కొందరు కార్మికులను తొలగించడంతో రోడ్డున పడ్డారు. మిగతా కార్మికుల్లో అ భద్రత భావం నెలకొంది. టీఆర్‌ఎస్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హమీ నిలబెట్టుకోవాలి.

     - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే

 

 అమరుల గురించి మాట్లాడే హక్కులేదు

 టీడీపీ సభ్యులు అమరవీరుల గురించి మాట్లాడడం దెయ్యలు వేదాలు వల్లించినట్లుంది. వాస్తవానికి అమరుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు. శాసనసభలో సైతం కేసీఆర్ అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని ప్రకటించారు.టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడితే వారి ఆత్మలు ఘోషిస్తాయి. టీడీపీ-కాంగ్రెస్ దొందుదొందే. అమరులను ఆదుకునేందుకు ఉద్యోగులు ఒక్క రోజు వేతన ం ఇస్తే అప్పటి సీఎం పట్టించుకోలేదు. కేసీఆర్ దీక్ష సమయంలో తెలంగాణ ఇచ్చి ఉంటే ఇన్నీ ప్రాణ త్యాగాలు జరిగేవి కాదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాల పట్ల చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించి 459 మందిని గుర్తించింది. మిగితా త్యాగధనులను గుర్తించమని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.    

 -వి. శ్రీనివాస్ గౌడ్, చల్లాదర్మారెడ్డి, గుణేష్ గుప్తా,

 

  ఏ రమేష్  టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

 పొన్నాలను శిక్షించాలి

 దళితుల భూముల వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను చట్టపరంగా శిక్షించాలి. రాజ్యంగ బద్ధంగా చట్టాలు తెలిసి కూడా దళితులకు అసైన్డ్ చేసిన భూములను కొనుగోలు చేయడం నేరమే. 1970 చట్టం ప్రకారం అసైన్డ్ భూములను కొనుగోలు చేసినా.. అమ్మినా  చట్టపరంగా నేరమే.  పొన్నాల టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.

- యాదగిరి రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top