సభ్యత్వ లక్ష్యం అధిగమించాలి


జిల్లాలో బీజేపీ సభ్యత్వ లక్ష్యాన్ని అధిగమించాలని, లేకుంటే ఇతర పార్టీలతో పొత్తుల తలనొప్పి తప్పదని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శ్రేణులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో సమావేశం నిర్వహించారు.

 

 కరీంనగర్ అర్బన్ : జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యసాధనకు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచించారు. సభ్యత్వ నమోదుపై సమీక్షకు శుక్రవారం కరీంనగర్ వచ్చిన ఆయన బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. సభ్యుల సలహాలు తీసుకున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండడంతో నమోదుపై శ్రద్ధ చూపలేదని సభ్యులు తెలపగా, మార్చి 31 వరకు గడువు ఉన్నందున జిల్లా నుంచి 3 లక్షల సభ్యత్వాల లక్ష్యం చేరాలన్నారు. వచ్చే నెల 3 నుంచి 6 వరకు మండలస్థాయి సమావేశాలు, 9 నుంచి 12 వరకు మెగా సభ్యత్వ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇప్పటివరకు 60 వేల సభ్యత్వాలు అయ్యాయని మిగతా 2.60 లక్షలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

 

  సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి ప్రేమ్‌సింగ్ రాథోడ్, కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనిత, కుమార్, కోమల ఆంజనేయులు, ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, ప్రధాన కార్యదర్శులు కన్నం అంజయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, బల్మూరి జగన్మోహన్‌రావు, న్యాలకొండ నారాయణరావుతదితరులు పాల్గొన్నారు.

 

 లక్ష్యం చేరకుంటే పొత్తు

 జిల్లాకు ఇచ్చిన సభ్యత్వ లక్ష్యం చేరకుంటే వేరే పార్టీ తో పొత్తు ఉండే అవకాశముంటుందని కిషన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ లు ఇన్సూరెన్స్, ఇతర ఆఫర్లు చూపించి సభ్యత్వాలు చేయిస్తున్నాయన్నారు. బలమైన బీజేపీ-బలమైన భారత్ నినాదంతో ప్రజలవద్దకు వెళ్లి సభ్యత్వ నమో దు చేయించాలని సూచించారు.

 

 లక్ష్యం చేరకుంటే తె లంగాణలో కేంద్రంలో వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని, పూర్తి చేస్తే ఎలాంటి తలనొ ప్పి ఉండదని అన్నారు. నిత్యం ఒక గంట సమయం పార్టీకి కేటాయించి సభ్యత్వం చేయించాలన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని మహిళామోర్చా నాయకులు శాలువాకప్పి సన్మానం చేశారు. సిక్కులు కరవాలం బహూకరించారు. అంతకుముందు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి కోర్టు చౌరస్తా మీదుగా శ్రీదేవి ఫంక్షన్ హాల్‌కు బైక్‌ర్యాలీ నిర్వహించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top