రివాల్వర్ పోగొట్టుకున్న ఎస్ఐ సస్పెన్షన్

రివాల్వర్ పోగొట్టుకున్న ఎస్ఐ సస్పెన్షన్ - Sakshi


సర్వీసు రివాల్వర్ పోగొట్టుకున్న ఖమ్మం జిల్లా ఆళ్లపల్లి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.దసరా ఆయుధపూజ సమయంలో ఆయుధాలన్నింటినీ ఒకచోట చేర్చారు. అప్పుడే ఈయన సర్వీసు రివాల్వర్ మాయమైంది. ఆ విషయం ఉన్నతాధికారులకు వెంటనే తెలియలేదు. కొన్నాళ్ల తర్వాత వాళ్ల దృష్టికి వెళ్లింది. దాంతో విచారణకు ఆదేశాలు జారీచేశారు. అయితే.. పది రోజుల తర్వాత తిరిగి ఆ ఆయుధం పోలీసు స్టేషన్లో ప్రత్యక్షమైందంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.



ఆయుధం ఎవరి వద్దకు వెళ్లింది, ఎలా వచ్చిందన్న విషయమై విచారణ జరుపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్న స్టేషన్లో పనిచేస్తూ, ఆయుధాన్ని పోగొట్టుకోవడం సరికాదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆ ఆయుధం వారి చేతికి వెళ్లి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని చెబుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీఐజీ మల్లారెడ్డి.. ఎస్ఐ  పృథ్వీధర్ గౌడ్ను సస్పెండ్ చేశారు. సత్తుపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top