పరిశీలన పూర్తయింది..


  •      పాఠశాలలను సందర్శించిన 17 బృందాలు

  •      టాయిలెట్లు, నీటి సౌకర్యంపై ఆరా

  •      నివేదికలతో నేడు హైదరాబాద్‌కు...

  •      అవసరమైన పాఠశాలలకు ఎస్‌ఎస్‌ఏ నిధులు

  • విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్షాభియాన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశీలన పూర్తయింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో టాయిలెట్లు ఉన్నాయా, ఉంటే నీటి సౌకర్యం ఎలా ఉంది, వినియోగంలో ఉన్నా యా, లేదా అని ఆరా తీశారు. ఇంజినీరిం గ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, ఇతర సిబ్బందితో ఏర్పాటు చేసిన 17 బృందాలు జిల్లాలోని అన్ని పాఠశాలలను స్వయంగా తనిఖీ చేశాయి. ఈ మేరకు తనిఖీల్లో తేలిన వివరాలతో నివేదిక రూపొందించారు.

     

    సుప్రీం కోర్టు ఆదేశాలతో..

     

    అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్లు, నీటి వసతి కల్పించాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, పాఠశాలల్లోని వసతులపై నివేదిక సమర్పించాలని సూచించింది. ఇందుకు ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరిన విషయం విదితమే. ఈ మేరకు 17 బృందాలుగా ఏర్పడిన అధికారులు వారం రోజుల పాటు అన్ని మండలాల్లోని పాఠశాలలను పరిశీలించారు. జిల్లాలో పీఎస్, యూపీఎస్, హైస్కూళ్లు కలిపి 3,266 పాఠశాలలు ఉండగా, వీటిలో 57 పాఠశాలల్లో అసలు టాయిలెట్స్ లేవని వెలడైంది. అంతేకాకుండా 460 పాఠశాలల్లో ఒక్కో టాయిలెట్ మాత్రమే ఉన్నట్లు, 600నుంచి 700 పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నా నీటి వసతి లేకపోవడం వంటి కారణాలతో నిరుపయోగంగా మారినట్లు గుర్తించారు.

     

    ఆగస్టు 31లోగా వసతుల కల్పన

     

    పాఠశాలల తనిఖీలో భాగంగా అసలు టాయిలెట్స్ లేని పాఠశాలలను గుర్తించి న అధికారులు వాటికి రూ.35వేల చొప్పు న నిధులను గురువారం మంజూరు చేశా రు. అలాగే, ఒక్కో టాయిలెట్ ఉన్న పాఠశాలలకు మరొకటి మంజూరు చేశారు. అంతేకాకుండా ఉపయోగంలో లేని టాయిలెట్లను వినియోగంలోకి తీసుకురావాలని, దీనికోసం రన్నింగ్ వాటర్ లేకపోతే నీరు నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గతం లో 131 టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అధికారులు తాజాగా మంజూరు చేసిన అన్ని నిర్మాణాలను ఆగస్టు 31వతేదీ కల్లా పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అంతేకాకుండా 400 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదని గుర్తించిన అధికారులు క్యాన్ల ద్వారా నీరు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

     

    నేడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం

     

    జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి వసతి వంటి సౌకర్యాలు తెలుసుకునేందుకు చేపట్టిన సర్వేపై హైదరాబాద్ శుక్రవారం సమీక్ష జరగనుంది. సర్వేలో వెల్లడైన అంశాలతో రూపొందిం చిన నివేదికతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు సర్వశిక్షాభియాన్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top