ఎన్.ఎస్.ఎస్.. నాలోనూ.. సేవా స్ఫూర్తి


మంచిర్యాల టౌన్ : ఎన్‌ఎస్‌ఎస్.. నేషనల్ సర్వీస్ స్కీమ్(జాతీయ సేవా సమితి) దీనిని విద్యార్థులు చక్కగా ఆకళింపు చేసుకున్నారు. ఁనాలోనూ సేవా స్ఫూర్తి* ఉందంటూ నిరూపిస్తున్నారు. కళాశాలలో అందివచ్చిన ఈ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. సమాజానికి ఉపయోగపడున్నారు. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. వివిధ స్థానిక సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నారు.



 మంచిర్యాలలో..

 మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్ విభాగం అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపును చాటుకుంటుంది. ఎయిడ్స్ డే, పల్స్‌పోలియో, రక్తదాన శిబిరాల్లో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొంటూ తమవంతు పాత్రను పోషిస్తున్నారు. కళాశాలలో 1956లో జాతీయ సేవా సమితి ప్రారంభమైంది. 1980లో రెండు యూనిట్లుగా ఏర్పడి వివిధ కార్యక్రమాలను విస్తృతం చేస్తుంది. సేవా కార్యక్రమాలతో పాటు స్థానిక, జాతీయస్థాయి శిబిరాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. మంచిర్యాలలో ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలతో పాటు 7 ప్రైవేట్ కళాశాలల్లో ఎన్‌ఎస్‌ఎస్ కొనసాగుతోంది.



 నాట్ మీ బట్ యు

 ‘నాట్ మీ బట్ యు’ అనే నినాదంతో శిబిరాలు నిర్వహిస్తూ దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అనే నానుడిని మంచిర్యాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సాకారం చేస్తున్నారు. పల్లెల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తు గ్రామ సమస్యల పై నిర్ధిష్టమైన కార్యచరణతో సేవలందిస్తున్నారు. పథకాల అమలుతీరు, రేషన్‌కార్డుల పంపిణీ, రోడ్ల నిర్మాణం, పచ్చదనం పరిశుభ్రత, అక్షరాస్యత, పల్స్‌పోలియో, ఎయిడ్స్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ వీధి నాటకాల ద్వారా గ్రామస్థుల్లో చైతన్యం తీసుకోస్తున్నారు.

 

 ఎన్‌ఎస్‌ఎస్‌తో గౌరవం

 ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సేవ చేయడం ఎంతో గౌరవం. కళాశాలలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాలోనూ సేవాభావం ఉందని చాటుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. నేడు విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు సేవా భావాన్ని పెంపొందించడమే ఎన్‌ఎస్‌ఎస్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యార్థుల్లో చైతన్యం నింపాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top