కాలేజి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి

కాలేజి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి


కామారెడ్డి : నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి మండల డిగ్రీ కాలేజి ఆస్తులను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు నిరాహార దీక్షకు దిగారు. ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులు విరాళాలు వేసుకుని 1964లో ఈ డిగ్రీ కాలేజ్ ని ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఉద్యమాల కారణంగా అప్పట్లో ఈ కాలేజి  యాజమాన్య బాధ్యతలు ప్రభుత్వపరమైనా... ఆస్తులు మాత్రం ప్రైవేటు వ్యక్త చేతుల్లోనే ఉన్నాయి.


దీనివల్ల కాలేజీకి రావాల్సిన యూజీసీ గ్రాంట్స్, నాక్ గుర్తింపు రాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడి విద్యార్థి నాయకులు ఈ విషయం గురించి సీఎం కేసీఆర్ తో చర్చించారు. అయినా ఫలితం లేకపోవడంతో జేఏసీ కన్వీనర్ జగన్నాథం, లక్ష్మారెడ్డి, బాలరాజు గౌడ్ తదిత రులు ఆమరణ దీక్షకు దిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top