సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు - Sakshi


అధికారులతో కలెక్టర్ రఘునందన్‌రావు సమీక్ష        

మొయినాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నారు. 3న చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో బుధవారం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు చిలుకూరు మహిళా ప్రాంగణంలోని డీఆర్‌డీఏ కార్యాయలంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల వారీగా ఏర్పాట్ల పనులను అప్పగిం చారు. ఆయా శాఖల అధికారులు పనులు వేగవంతం చేసిపటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచిం చారు.



శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకుంటారని, ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆల య ప్రాంగణంలోనే ఓ మొక్కను నాటుతారని చెప్పారు. ఆలయంలో సుమారు 20-25 నిమిషాల పాటు సీఎం ఉంటారన్నారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగసభ ప్రాంతంలో మొక్కలు నాటి ‘తెలంగాణ హరితహారం’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. సభ ముగింపు అనంతరం  సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటుతారని చెప్పారు. ఆ తర్వాత ఘట్‌కేసర్ మండలం నారపల్లికి చేరుకుని అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై శంషాబాద్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌తో సమీక్షించారు.

 

వేగవంతంగా పనులు..


3న సీఎం కేసీఆర్ రానుండడంతో చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సభావేదిక, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో మట్టిపోసి గుంతలను పూడ్చివేస్తున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెల్లే రహదారికి మర్మతులు చేపట్టారు. గుంతల పడిన ప్రాంతంలో రీబీటీ తారురోడ్డు వేశారు. రోడ్డు ఇరుపక్కల మట్టిపోసి చదును చేస్తున్నారు. మొక్కలు నాటే స్థలాలను సైతం చదును చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులు చేపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top